విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన సదస్సు..యస్ఐ వెంకట్ రెడ్డి
అడ్డగూడూరు 15 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్&రవాణా శాఖల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తునందున..ఈ వారోత్సవాల సందర్భంగా బుధవారం రోజు అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అడ్డగూడూరు పోలీసులు గోవిందపురం గ్రామంలో పల్లోటి స్కూల్ విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించి మానవహారాన్ని ఏర్పాటు చేసి స్థానికులకు ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి ఎస్ఐ వెంకట్ రెడ్డి అవగాహన కలిగించడం జరిగింది. అదేవిధంగా కంచనపల్లిలోని కస్తూర్బా బాలికల విద్యార్థులతోటి వారి తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించాలని సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని తెలుపుతూ లెటర్ రైటింగ్ రాయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్కూలు యజమాన్యం పోలీస్ సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.