మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహం ఏర్పాటుకు సహకరించడం అభినందనీయం

Dec 4, 2024 - 18:59
Dec 4, 2024 - 19:10
 0  3
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహం ఏర్పాటుకు సహకరించడం అభినందనీయం

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహ ఏర్పాటుకు సహకరించడం అభినందనీయం

తెలంగాణ వార్త 04.12.2024. సూర్యాపేట జిల్లా ప్రతినిధి: 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా అనేక పదవులకు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య వన్నెతెచ్చారని హైదరాబాదులో ఏదైనా మంచి ప్రదేశాన్ని గుర్తిస్తే అక్కడ విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాదులో కొనిజేటి రోశయ్య మెమోరియల్ ఫోరం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన మూడవ వర్ధంతి కార్యక్రమం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయనకు నివాళులు అర్పిస్తూ ప్రకటించడం అభినందనీయ మన్నారు. పాలక, ప్రతిపక్షంలో ఉన్న మాటల చతురతతో అందర్నీ ఆకట్టుకునే గొప్ప మహనీయుడు రోశయ్య అన్నారు. అందరికీ అజాతశత్రువుగా ఉంటూ వ్యక్తిగత స్వార్థం లేకుండా పనిచేయడం వల్లే ఆయనకు అనేక పదవులు వరించాయని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయని , వర్ధంతి సభలో కార్పొరేషన్ కు నిధుల ప్రస్తావన తీసుకు రాకపోవడం పేద ఆర్యవైశ్యులకు కొంచెం బాధాకరమే అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే ఆర్యవైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించి పేద ఆర్యవైశ్యులకు ఆర్థిక భరోసా కల్పించాలన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223