తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి
---అంతర్జాతీయ గాంధీ పథం అధ్యక్షులు డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి
తెలంగాణ వార్త జూన్ 23 జిల్లా స్టాప ర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షాల విమర్శలు తిప్పి కొట్టాలంటే శిక్షణ తరగతుల ద్వారా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కేడర్ను సమాయత్తం చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి శ్రీమతి మీనాక్షి నటరాజన్ కు అంతర్జాతీయ గాంధీ పథం అధ్యక్షులు డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారుమధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి బిజెపి కుట్ర పూరిత రాజకీయాల వల్ల రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోయిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి శ్రీమతి మీనాక్షి నటరాజన్ ను అంతర్జాతీయ గాంధీపథం అధ్యక్షులు డా.భూశిరెడ్డి శంకర్ రెడ్డి కలిసి విచారం వ్యక్తం చేశారు. బిజెపి కుట్రపూరిత రాజకీయాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని మట్టుపెట్టి రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని డా.భూసిరెడ్డి శంకర్ రెడ్డి ఉద్ఘాటించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి గా చూడటం కోసం రాష్ట్రవ్యాప్తంగా గాంధీ పథం కార్యాచరణ రూపొందించి పనిచేస్తుందని ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ కు
డా.బూసిరెడ్డి శేఖర్ రెడ్డి వివరించారు. కొత్తగూడెం గాంధీ పదం కన్వీనర్ చింతలచెరువు గిరిశం కూడా డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి తో పాటు పాల్గొన్నారు.