తాడిచెట్టును కొడుతుండగా అదే చెట్టు మీదపడి యువకుడు మృతి
అడ్డగూడూరు 7 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– అడ్డగూడూరు మండల పరిధిలోని బొడ్డుగూడెం గ్రామంలో గురువారం రోజు మధ్యానం సమయంలో చుక్క బిక్షం తండ్రి లింగయ్య,వయసు 42 సంవత్సరాలు అను అతను తన సొంత పొలంలో తాడిచెట్టుని కొడుతుండగా అదే చెట్టు అతని మీదపడి త్రీవంగా లోపలి గాయాలు కావడం వల్ల కుటుంబ సభ్యులు అతన్ని హుటా హుటిన భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.సమాచారం అందుకున్న అడ్డగూడూరు పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.