TB ముక్త్ భారత్ అభియాన్

Sep 17, 2025 - 19:32
 0  16
TB ముక్త్ భారత్ అభియాన్

 జోగులాంబ గద్వాల 17 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల. డిఎంహెచ్వో డాక్టర్. ఎస్. కె. సిద్ధప్ప చేతుల మీదుగా   ఈరోజు జిల్లా ఆసుపత్రిలో టీబి రహిత గ్రామపంచాయతీ పోస్టర్ ప్రారంభం చేయడం జరిగినది .

ఈ కార్యక్రమంలో డాక్టర్.జి.రాజు టీబి ప్రోగ్రాం ఆఫీసర్ మాట్లాడుతూ మన జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామ పంచాయతీని టీబి రహితంగా చేయడమే మన సంకల్పమని చెప్పారు.
ఇందులో భాగంగా అందరూ గ్రామ ప్రజలు టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరడం జరిగినది. 

ఈ కార్యక్రమంలో భాగంగా టీబి హై రిస్క్ పాపులేషన్ ను స్క్రీనింగ్ నిర్వహించబడినది:

1...60 సంవత్సరాల పైబడిన వారు 
2... అండర్ వెయిట్ వారు 
3... పొగ త్రాగువారు మరియు మద్యపానం సేవించువారు 
4.. ఓల్డ్ టీబీ పేషెంట్స్ 
5... హై రిస్క్ ఏరియా లో ఉన్నవారికి, రక్తపోటు మరియు డయాబెటిక్ ఉన్నవారికి గుర్తించి వారికి :
ఎక్సరే పరీక్షలు ????, టీబి స్ఫూటుం????,Cy -TB పరీక్ష,బిపి మరియు ఇతర రక్త  పరీక్షలు నిర్వర్తించడం జరిగినది. 


ఇట్టి కార్యక్రమంలో డిస్టిక్ టీబి ప్రోగ్రాం కోఆర్డినేటర్ సాదిక్,కౌన్సిలర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు...... X-ray టెక్నీషియన్లు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333