హైదరాబాద్ మహానగరం లో
హైదరాబాద్ మహానగరం లో ఎల్బీనగర్ చౌరస్తాలో భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మల్కాజ్గిరి రోడ్డు సేఫ్టీ డిసిపి మనోహర్ గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు దేశ విదేశాలు తిరిగి ఎన్నో శాస్త్రాలు చదివి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప ప్రపంచ మేధావి, మహిళలు శ్రామికులు అట్టడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు బి ఆర్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాలను సాధించాలన్నారు అనంతరం హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి దైద వెంకన్న అనితల దంపతుల ద్వితీయ కుమార్తె చిరంజీవిప్రకృతి హరిత దీక్షకురాలు దైద సింధు తెరిసా( శ్రీ సాయి చైతన్య స్కూల్ సాయి నగర్, నాగోల్ 5వ తరగతి)సామాజిక కార్యకర్త. దైద వెంకన్న తో కలిసి డిసిపి మనోహర్ గారికి శాలువా కప్పి పూల మొక్కలు అందించినారు బి ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు తెలంగాణ దళిత సంఘాల జేఏసీ చైర్మన్ ఈదుల పరశురాములు, చిప్పలపల్లి యాదగిరి, బూర్గుల నాగేందర్, కలకొండ దుర్గయ్య బల్గూరి సాగర్, ముత్యాలు, కనుకుంట్ల రవి మహిళా నాయకురాలు పోలీస్ సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని అంబేడ్కర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు