స్వేరో కమిటీ ఆధ్వర్యంలో అఖిలకు సన్మానం

చిన్నబావి 21 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– వీపనగండ్ల గ్రామం వనపర్తి జిల్లా ఏ రాజు తనకు మ్యారేజ్ అయిన ఒక ఐదు సంవత్సరాల తను వికలాంగుడిగా మారాడు తాను విద్యలోని ఎన్నో విజయాలు సాధించాలనుకున్నటువంటి కళ కళ గానే మిగిలిపోయింది.రాజు యొక్క కలలను అతని కూతురు ద్వారా నెరవేర్చుకోవాలని.ఒకటవ తరగతి నుంచి నాలుగో తరగతి వరకు స్థానికంగా ఉన్న విపనగండ్ల స్కూల్లో చదివిడాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గురుకుల సెక్రటరీగా ఉన్నపుడు గురుకులాల్లో ఐదవ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ యొక్క నోటిఫికేషన్ అఖిలను అప్లై చేపించాడు మొదటిసారి ఎంట్రెన్స్ టెస్ట్ లో పాస్ అయ్యి కమ్మదనం గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యను అభ్యసించి పాఠశాలలో 10 తరగతి పాస్ అయి అదే సో్సెల్ వెల్పర్ బుద్దారం గురుకుల జూనియర్ కాలేజీ లో జాయిన్ అయి నా అఖిల తన తండ్రి యొక్క కళ నిరవేర్చాలని కళాశాల ఉపద్యాల సలహాతో ఎంబిబిఎస్ తన లక్ష్యంగా పెట్టుకొని.ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు రావడం తో పాటు తన చిన్న తనంలో తన నాన్న పడిన కష్టాలను చూసి గౌల్దొడ్డి లో నీట్ కోచింగ్ తీసుకొని
ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ రావడం మరియుఅదే జిల్లాకు చెందిన అఖిలకు వనపర్తి జిల్లాల్లో ఎంబిబిఎస్ మెడికల్ కాలేజీలో సీటు రావడం ఆనందంగా భావించి తల్లిదండ్రులు
కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తపరిచారు ఈ సన్మాన కార్యక్రమంలో వనపర్తి జిల్లా స్వేరో నాయకులు మాట్లాడుతూ విద్యలోని విద్యకు దూరమైనటువంటి ఎంతోమంది విద్యార్థులకు అఖిల ఆదర్శనీయం నిరుపేద కుటుంబంలో పుట్టి అక్షరమే ఆయుధంగా పెట్టుకుని అక్షర జ్ఞానాన్ని పెంపొందించుకోవడమే నిజమైన విద్యార్థి లక్షణాలు అన్నారు జిల్లా స్వేరో నాయకులు.ఈ సన్మాన కార్యక్రమంలోవనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి పరమల ప్రకాష్ స్వేరోవైస్ ప్రెసిడెంట్ తోలు రామకృష్ణ,ఆర్గనైజింగ్ సెక్రటరీ కేతాపగా మధు జాయింట్ సెక్రెటరీ మహేష్ జిల్లా కార్యనిర్వాహక సభ్యులు రామచంద్ర స్వేరో
జిల్లా స్వేరో సీనియర్ నాయకులు వేణు,మీసాల నాగరాజు, బాలరాజు స్వేరో. అంజిస్వేరో. మహేష్ స్వేరో. నాయకులు
పాల్గొన్నారు.