సూర్యాపేటలో బంగారం కోసం దారుణ హత్య
సూర్యాపేటలో వృద్ధురాలి దారుణ హత్య, బంగారం దోపిడీ
సూర్యాపేట,18 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 28వ వార్డు జై జై నగర్ శబరి మిల్క్ సెంటర్ వెనుక వైపు వృద్ధురాలి ఇరుగు పాపమ్మ ను దారుణ హత్య కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు ఆమెను హతమార్చి, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న ఎస్సైలు ఐలయ్య, ఏడుకొండలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.