మేడే ను జయప్రదం చేయండి.
వాడ వాడలా ఎర్రజెండాలను ఎగురవేయండి
ఏ ఐ టి యు సి ప్రాంతీయ అధ్యక్షులు దంతాల రాంబాబు పిలుపు
సూర్యపేట 28 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– ప్రపంచ కార్మికుల పర్వ దినం 141వ మేడే ను జయప్రదం చేయాలని, పట్టణoలోని వాడ వాడలా ఎర్రజెండాలను ఎగుర వేయాలని ఎఐటియుసి ప్రాంతీయ అధ్యక్షులు దంతాల రాంబాబు పార్టీ శ్రేణులకు, కార్మికులకు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ధర్మభిక్షం భవనంలో ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ అన్ని సెంటర్లో ఏఐటీయూసీ అనుబంధ సంఘాల కార్మికులు, సిపిఐ కార్యకర్తలు, ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ను వాడ వాడలా గ్రామ గ్రామాన ఎర్రజెండాలు జెండాలని ఎగరవేసి మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు. 1886లో అమెరికాలోని చికాగో నగరంలో వెట్టిచాకిరి, బానిసత్వం నుండి విముక్తి కోసం 8 గంటల పని దినాన్ని కోరుతూ కార్మికుల వీరొచిత పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేశారు ఆనాడు అమెరికా ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో వేలాదిమంది కార్మికుల పాణాల అర్పించారని వారి రక్తంతో తడిసిన చొక్కయే నేడు ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండాగా కార్మికుల వర్గాన్ని స్ఫూర్తిని ఇస్తుందన్నారు. ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, చివ్వెంల మండల కార్యదర్శి ఖమ్మం పార్టీ రాము, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి ఎడెల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.