మూలవాసి బచావో మంచ్ పై నిషేధం వెంటనే ఎత్తివేయాలి,

జాతీయ మానవ హక్కుల సంఘం వేణుగోపాల్ రెడ్డి గుజ్జుల

Mar 1, 2025 - 00:38
Mar 1, 2025 - 09:03
 0  5
మూలవాసి బచావో మంచ్ పై నిషేధం వెంటనే ఎత్తివేయాలి,

మూలవాసి బచావ్ మంచ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేసి, మావోయిస్టుల సమస్యను, లా అండ్ ఆర్డర్ సమస్యగా కాకుండా, దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్, జోక్యం చేసుకొని రాజ్యాంగబద్ధమైన తీర్పుని ఇచ్చి, ఈ యుద్ధాన్ని ఆపాల - జాతీయ మానవ హక్కుల సంఘం వేణుగోపాల్ రెడ్డి గుజ్జుల.

దేశంలో పలు రాష్ట్రాల్లో జరుగుతున్న మారనకాండను దృష్టిలో ఉంచుకొని, మూలవాసులైన ఆదివాసులను అణిచివేయాలని జరుగుతున్న చర్యలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సుమోటోగా ఈ సమస్యను తీసుకుని దీనిపై వెంటనే తగిన న్యాయ పరమైన తీర్పుని ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల సంఘం కోరుతున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న మారణకాండ తో పాటు, ఆదివాసుల హత్యలను ఖండిస్తూ, ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాలని ప్రశ్నిస్తూ, మూలవాసి బచావో మంచ్ ఏర్పడింది, చతిస్గడ్ రాష్ట్రంలో తీవ్రమైన పోరాటంగా రాగులుతుంది కానీ, గత ఏడాది నుండి ఆపరేషన్ కాగార్ మూలంగా ఎవరూ కూడా ఈ మూలవాసి బచావో మంచి ద్వారా కార్యక్రమాలు చేయడం తగ్గించారు, వారు భయభ్రాంతులకు గురైయారు, చాలామందిని ఆ రాష్ట్రం నిర్బంధించి అరెస్టు చేసి జైలకు పంపించడం జరిగింది. కావున వీటన్నిటిని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వెంటనే ఈ సమస్యని పరిష్కరించాలని, దేశంలో అన్ని సంఘాలు తో పాటు జాతీయ మానవ హక్కుల సంఘం కూడా కోరుతున్నారు. 

గతేడాది మే నెలలో వచ్చిన కథనాన్ని దృష్టిలో ఉంచుకొని, మూలవాసి బచావో మంచ్ నాయకుడైన రఘు మీడియం నీ అరెస్టు చేయడం జరిగింది. అలాగే ఈ మూలవాసి బచావో మంచ్ పేరుతో అరెస్టు అయిన వారందరినీ న్యాయవిచారని జరిపించి, వెంటనే విడుదల చేయాలని జాతీయ మానవ హక్కుల సంఘం కోరుతుంది. రాజ్యాంగాన్ని కట్టుబడి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా, రాజ్యాంగపరమైన చర్యలకు జాతీయ మానవ హక్కుల సంఘం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు, కావున రాజ్యాంగ బద్దంగానే ఈ నిషేధిత మావోయిస్టుల సమస్యను మరియు మూలవాసులైన ఆదివాసులపై జరుగుతున్న దాడులను వారు చేస్తున్న పోరాటాన్ని న్యాయ విచారణ చేయించి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని, దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు న్యాయవాదులను కోరుతున్నాను. ఇప్పటికే చాలామంది అమాయకులైన ఆదివాసులు మరియు ఈ యుద్ధం కారణంగా ఎంతోమంది పోలీసులు,సీఆర్పీఎఫ్ బలగాలు, డి ఆర్ జి బలగాలు, కార్బ్ర బలగాలు, వారి కుటుంబాలకి దూరమయ్యారని గుర్తు చేస్తున్నారు, ఈ యుద్ధం వల్ల ఇరుపక్షాల్లో బలి అవుతున్నది కేవలం బడుగు బలహీన వర్గాలే, అని అందులో ముఖ్యంగా ఆదివాసులే అని, దేశంలో ఇటువంటి సమస్యలను న్యాయబద్ధంగా చర్చల ద్వారా అత్యున్నత న్యాయస్థానం పరిష్కరించాలని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గా చూడకూడదని, దానివల్ల ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నో కోట్ల ఆస్తి ద్వంశమవుతుందని, వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, తెలియపరిచారు, దేశం లో ఎన్నో సమస్యలు ఉన్నాయి ,ఎన్నో ఆకలి చావులు ఉన్నాయి, ఇంకా ఎపుడే డెవలప్మెంట్ దిశగా మన దేశం వెళ్తుంది, కావున జాతీయ మానవ హక్కుల సంఘం గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి విన్నపాన్ని స్వీకరించి, ఈ సమస్యను సుమోటోగా తీసుకొని న్యాయబద్ధమైన తీర్పునిచ్చి ఈ యుద్ధానికి స్వస్తి పలకాలని కోరారు. అలాగే ఈ మూలవాసి బచావో మంచ్ పేరుతో జరుగుతున్న దాడులను మరియు అరెస్టులను మరియు నిషేధిత మావోయిస్టులు తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపి ఇరుపక్షాల దేశ ప్రజల ప్రాణాలను కోల్పోకుండా తీర్పునివ్వాలని ఎంతోమంది అమాయక గిరిజన ఆదివాసులు మరియు ఎంతోమంది మావోయిస్టుల పార్టీ లో పనిచేసి అరెస్టై నిర్బంధించి జైల్లో ఉన్న వారందరిపై న్యాయవిచారం జరిపించి ఈ పూర్తి సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చి రాజ్యాంగపరమైన తీర్పునిచ్చి మన దేశాన్ని అభివృద్ధి చెందే విధంగా ముందుకెళ్లాలని ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా న్యాయస్థానం ఒక దేవాలయం అని అందరికీ సమానమైన న్యాయం దక్కుతుందని ఆశిస్తూ ఈ సమస్య ఈ ఏడాది లోగా పరిష్కరించాలని కోరారు. అలాగే ఈ నిషేధిత మావోయిస్టు పార్టీ ఏర్పడడానికి కారణాన్ని కూడా గుర్తించి ఆ విధంగా మారకుండా దేశంలో పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను జరగకుండా చూసే విధంగా జీవోలను పాస్ చేయాలని, రాజ్యాంగపరమైన రాజ్యాన్ని నిర్మించాలని కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333