ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఘట్‍కేసర్‍లో పర్యటించబోతున్నారు
పర్యటనలో భాగంగా ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ విగ్రహం, స్మృతివనం పనులకు భూమి పూజ చేయనున్నారు... గతేడాది నవంబర్ 10వ తేదిన అందెశ్రీ మరణించిన సంగతి తెలిసిందే. ఘట్ కేసర్ ఎన్ ఎఎఫ్‍సీ నగర్ లో పోలీస్ లాంఛనాలతో ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను నిర్వహించింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అందెశ్రీ పాడెను మోశారు. అంత్యక్రియల అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అందెశ్రీకి స్మృతి వనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో రేపు అందెశ్రీ విగ్రహం, స్మృతివనం పనులకు భూమి పూజ చేయనున్నారు.