ప్రైవేట్ ను వదిలి సర్కారు బడికి

Jun 22, 2026 - 19:36
 0  24
ప్రైవేట్ ను వదిలి సర్కారు బడికి
ప్రైవేట్ ను వదిలి సర్కారు బడికి

ప్రాథమిక పాఠశాల 14 మంది విద్యార్థులు

ప్రీ ప్రైమరీ అంగన్వాడికి 9 మంది విద్యార్థులు

 జోగులాంబ గద్వాల 22 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  తెలుగొన్పల్లి గ్రామస్తులు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పిస్తూ మార్పుకు  నాంది పలుకుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారు  గద్వాల. మండలం లోని తెలుగొనిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు గ్రామ సర్పంచ్ దాసరి బిసన్న సమక్షంలో 23 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడమైనది...

వివరాల్లోకి వెళితే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు B. ప్రవీణ మేడం ఉపాధ్యాయులు మరిడి.శ్రీకాంత్, వెంకటేశ్వర గౌడ్  సర్పంచ్ సహకారంతో గ్రామంలో జనాభా గణన సమయం నుండి తల్లిదండ్రులను మోటివేషన్ చేస్తూ పాఠశాల పునః ప్రారంభం తర్వాత బడిబాట కార్యక్రమంలో పలు సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామం నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో ఉండే ఉచిత సౌకర్యాలు మొదలగు విషయాలపైన  అవగాహన కల్పిస్తూ మా పాఠశాలలో కూడా ఆంగ్ల మాధ్యమం ప్రారంభిస్తామని తెలియజేసి వారందరినీ కన్విన్స్ చేసి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను ప్రాథమిక పాఠశాలలో 14 మంది విద్యార్థులు ప్రీ ప్రైమరీ సెక్షన్ అంగన్వాడీలు 9 మంది విద్యార్థులను నేడు చేర్పించడమైనది ఉపాధ్యాయ బృందంపై నమ్మకం ఉంచి చేర్పించినందుకు సహకరించినందుకు అందరికీ పాఠశాల ఉపాధ్యాయ బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు విద్యార్థుల కు మా వంతుగా చక్కటి బోధనలు చేసి వారికి న్యాయం  చేస్తామని తెలియజేశారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ AAP చైర్మన్ ఉపాధ్యాయ బృందం గ్రామ పెద్దలు గ్రామ విద్యా అభిమానులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333