ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించాలి

Jun 22, 2026 - 19:39
 0  13
ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించాలి

కలెక్టర్ కి వినతి

బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

 గద్వాల 22 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  గద్వాల. BRSV (భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం) రాష్ట్ర పిలుపుమేరకు గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం యందు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది 

ఈ సందర్బంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ... 
* జిల్లాలోని ప్రైవేటు స్కూల్స్ లలో వసూలు చేస్తున్న అధిక ఫీజుల దోపిడీ ని అరికట్టాలి. ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టంను అమలు చేయాలి
* ఫీజుల నియంత్రణ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరమైన విఫలం.
* కార్పొరేట్, ప్రయివేట్ స్కూళ్లకు కొమ్ము కాస్తున్న రేవంత్ రెడ్డి
* ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.
* ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్యం విడనాడి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
* జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా పెంచుతున్న ఫీజుల వలన విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు తక్షణమే ఆ ఫీజులను నియంత్రించే విధంగా చట్టం తీసుకురావాలని డిమాండ్.
* కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అన్యాయం చేస్తుందని విద్యాశాఖ మంత్రి, స్వయానా ముఖ్యమంత్రి అయినప్పటికీ విద్యా విధానంలో చాలా లోపాలు ఉన్నాయి అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఫీజుల నియంత్రణ చేయకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినారు. అనంతరం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ఫీజుల పేరుతో యాజమాన్యాలు చేస్తున్న దోపిడీని అరికట్టి, పేద విద్యార్థులకు భారం లేకుండా చూడాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

* అదేవిధంగా ప్రభుత్వ బడులను మూసి వేయడం మానుకోవాలని అన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలను కచ్చితంగా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న 27 పాఠశాలలను 4 వేలకు కుదిస్తానని అనడం ఇది విద్యా వ్యవస్థకే సిగ్గుచేటు మాయని మచ్చ. ఇది ముఖ్యమంత్రి వచ్చిన మూర్ఖత్వపు ఆలోచన దీన్ని తక్షణమే విరమించుకోవాలి అని అన్నారు.

* అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న పదివేల కోట్లకు పైగా విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి అదేవిధంగా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

* ఫీజుల నియంత్రణ చట్టంను అమలు చేయకపోతే భవిష్యత్తులో బీఆర్ఎస్వి విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో విద్యార్థి జిల్లా నాయకులు గాజుల కృష్ణ రెడ్డి, కొమ్ము రంగస్వామి, యువరాజు, మాధవ్, ఇమ్రాన్, వికాస్, ప్రవీణ్, తిరుమలేష్, నరేష్, రాజు, రమేష్, మహేష్, రాజేష్, సుందర్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333