ప్రతి నెల 100 కు పైగా ఫోన్స్ రికవరీ చేస్తున్న జిల్లా పోలీస్
జిల్లాలో 13 వ సారి బాధితులకు మొబైల్స్ అందించిన ఎస్పీ నరసింహ.
జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన సుమారు 20 లక్షల విలువగల 102 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగినది. - ఆర్థిక పరమైన అంశాలకు ఈరోజుల్లో మొబైల్ ప్రదాన్యమైనది.
సంవత్సర కాలంలో 1744 మొబైల్స్ ను బాధితులకు అందించాం.- అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా ఉండొద్దు.
ఆదమరిచి ఉంటే ఆర్థిక నష్టం తప్పదు.
మంచిని సమర్ధించాలి, చెడును ప్రశ్నించాలి.
పిల్లలకు కష్ట పడటం నేర్పండి. సామాజికంగా ఎదగడం నేర్పించండి.
మేము మీ పోలీస్. ....కె.నరసింహ ఐపీఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.
సూర్యాపేట, 9 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఈరోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు 20 లక్షల రూపాయల విలువ గల 102 ఫోన్ల ను గుర్తించి రికవరీ చేసి జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ చేతుల మీదుగా 13వ సారి సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు (భాదితులకు) అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.... అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉంటే నష్టాలు తప్పవు, అప్రమత్తంగా ఉండాలి సురక్షితంగా ఉండాలి అన్నారు, అత్యాశకు పోయి, ఆదమరిచి ఉన్నా సైబర్ మోసగాళ్లు ఆర్థిక నష్టం కలిగిస్తారు అన్నారు. సమాజంలో మంచిని సమర్థించాలి చెడును ప్రశ్నించాలి అప్పుడే మన భావితరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించగలుగుతాం, సమాజంలో చెడు ఎక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరుగుతుంది సమాచారం ఇవ్వాలి, పిల్లలకు కష్టపడే తత్వాన్ని నేర్పించండి వృత్తుల పట్ల ప్రజల పట్ల సమాజం పట్ల గౌరవాన్ని సామాజికంగా ఎదగటాన్ని నేర్పించండి అని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యవసరమైనది, దీనిని కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం, ఆర్థిక పరమైన అంశాలకు వినియోగిస్తున్నాం, మన యొక్క విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫోటోలు మొదలైన వంటివి ఫోన్ లో నిక్షిప్తం చేసుకుంటున్నాము అన్నారు, మొబైల్ చోరికి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుంది. నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పాస్ వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతున్నారు. ఒక్కో మొబైల్ రికవరీ చేయడానికి సైబర్ వారియర్స్ పోలీస్, టెక్నికల్ టీం పోలీసు సిబ్బంది చాలా కృషి చేశారు, ఇతర రాష్ట్రాల వారి నుండి ఈ మొబైల్స్ ను రికవరీ చేశారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ ( https://www.ceir.gov.in ) నందు నమోదు చేసుకోవాలి, మొబైల్ ను బ్లాక్ చేసి, మీ సేవా ద్వారా ధరఖాస్తు సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసు శాఖ కృత నిచ్చయంతో పని చేసి ఈరోజు పెద్దమొత్తంలో ఫోన్స్ రికవరీ చేసి ఇక్కడ భాదితులకు అందించడం జరిగినది అన్నారు.
అత్యాశకు పోవద్దు
ప్రజలు అత్యాసకు పోయి సైబర్ మోసాల బారిన పడోద్దు తక్కువ వడ్డీకి లోన్స్ ఉన్నాయి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు, బహుమతులు వచ్చాయి అంటే నమ్మి అపరిచితులకు డబ్బులు పంపవద్దు, వ్యక్తిగత వివరాలు చెప్పవద్దు, మీ పిల్లలు డ్రగ్స్, అమ్మాయిల రవాణా లాంటి కేసుల్లో చిక్కుకున్నారు డిజిటల్ అరెస్ట్ చేస్తాం అని CBI, CID లాంటి దర్యాప్తు సంస్తల పేర్లు చెప్పి డబ్బులు కడితే కేసు నుండి తప్పిస్తాము అంటారు ఇది నమ్మవద్దు డిజిటల్ అరెస్ట్ అబద్దం అన్నారు.
ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీస్
పోలీసు మీకోసం ఉన్నారు, ప్రజా భద్రతలో అనుక్షణం కృషి చేస్తున్నాము, మీ ప్రాంతాల్లో జరుగుతున్న అశాంఘిక చర్యలు, అక్రమ రవాణా పై పోలీసుకు సమాచారం ఇవ్వాలి, సమాజంలో జరుగుతున్న అసాంఘిక చర్యలు, అక్రమాలు, అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రశ్నించే ప్రతిఒక్కరు యూనిఫాం లేని పోలీసు, వీటిపై మాకు సమాచారం ఇవ్వండి మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం అన్నారు, ప్రజలు పోలీసులకు మిత్రులుగా ఉంటూ నేరాల నివారణలో భాగస్వామ్యం కావాలి అన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ సైబర్ వారియర్స్, డ్రగ్స్ నిర్మూల వారియర్స్ లాగా ఉండాలి వీటిపై సమాచారం ఇస్తే మీరు పోలిసుతో భాగస్వామ్యం అయినట్లే, సైబర్ మోసాల గురించి చుట్టుపక్కల వారికి అవగాహన కలిగించాలి.
పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపిన మొబైల్స్ పొందిన బాధితులు.. పోయిన మొబైల్ ఫోన్లు మళ్లీ దొరకదనుకున్న బాధితులు జిల్లా పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంభందిత బాధితులు జిల్లా ఎస్పీ గారికి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాలో వివిధ రూపాల్లో వినియోగదారులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ ను CEIR అప్లికేషన్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐ.టి కోర్ సిబ్బందిని, పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, IT కోర్ ఆర్‌ఎస్‌ఐ రాజశేఖర్, ఐటి కోర్ సిబ్బంది, పోలీస్ సైబర్ వారియర్స్, మొబైల్ పోగొట్టుకున్న బాధితులు ఉన్నారు.