ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మాదకద్రవ్యాల అనర్ధాల పట్ల అవగాహన కోసం పోలీసు వినూత్న కార్యక్రమం.

Jun 10, 2026 - 23:10
 0  1
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మాదకద్రవ్యాల అనర్ధాల పట్ల అవగాహన కోసం పోలీసు వినూత్న కార్యక్రమం.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మాదకద్రవ్యాల అనర్ధాల పట్ల అవగాహన కోసం పోలీసు వినూత్న కార్యక్రమం.

డ్రగ్స్ నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత - సూర్యాపేట డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్.

డ్రగ్స్ నిర్మూలనకై అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటిన సూర్యాపేట జిల్లా పోలీస్, తెలంగాణ ఈగల్ టీం పోలీస్.

గంజాయి వినియోగం, సరఫరా కేసుల్లో ఉన్న నిందితులను భాగస్వామ్యం చేసి వారి ప్రవర్తనలో మార్పు రావాలని, ఆరోగ్యకరమైన జీవనం గడపాలని మొక్కలు నాటించడం జరిగినది. సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారిని అంతమొందించడమే లక్ష్యంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పోలీస్ ఈగల్ టీం నేతృత్వంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వినూత్న, ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాం అని సూర్యాపేట డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్ తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు, డ్రగ్స్ వినియోగం అలవాటు ఉన్న వారిలో మార్పు కోసం సంకేతంగా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవరణలో సూర్యాపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కలు నాటారు. దీనిలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రం గల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు స్థానిక ప్రభుత్వ వైద్యులు, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి సూర్యాపేట జిల్లా పోలీస్, తెలంగాణ ఈగల్ టీం పోలీసుల అధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాము అని పట్టణ డిఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు.

ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువతను, ప్రజలను డ్రగ్స్ భూతం పట్టిపీడిస్తోంది. మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత కేవలం పోలీస్ శాఖపైనే కాకుండా, సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా ఉంది. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో విస్తృత అవగాహన కల్పించేందుకే ఈ ప్రత్యేక మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. మొక్కలు ఎలాగైతే జీవాన్ని ఇస్తాయో, డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం కూడా అంతే ముఖ్యం అని చాటిచెప్పడమే మా సంకల్పం అన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ మగ్దూo అలీ, ఆసుపత్రి వైద్యులు, ఎస్ఐ లు సాయిరాం, ఏడుకొండలు, నీలిమ, ఈగల్ టీం పోలీసు సిబ్బంది ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333