ప్రజల ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం.. సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్.
సూర్యాపేట 20 జులై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– ఈరోజు సూర్యాపేట డివిజన్ కార్యాలయం నందు డిఎస్పీ ప్రసన్న కుమార్ పోలీస్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి బాధితుల నుండి పిర్యాదులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. సమస్యలు సంభదిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఎస్పి నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం డివిజన్ స్థాయి పోలీస్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగినది అని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపినారు.