నూతన సీసీ రోడ్డు శంకుస్థాపన చేసిన సర్పంచ్

Mar 15, 2026 - 19:03
Mar 15, 2026 - 20:04
 0  0
నూతన సీసీ రోడ్డు శంకుస్థాపన చేసిన సర్పంచ్

నూతన సీసీ రోడ్డు శంకుస్థాపన చేసిన సర్పంచ్ 

 హాజరైన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు .

తెలంగాణ వార్త నూగురు వెంకటాపురం ( మార్చి15 ) : వెంకటాపురం మండలం కేంద్రం లోని ఉప్పేడు వీరాపురం గ్రామపంచాయతీ పరిధిలోని వెంగళరావుపేట గ్రామంలో ఆదివారం నూతన సీసీ రోడ్డుకు గ్రామ పంచాయితీ సర్పంచ్ జెజ్జరి మానస రామకృష్ణ, ఉప సర్పంచ్ గుండెల ప్రశాంత్ శంకుస్థాపన చేశారు , వార్డు సభ్యురాలు వేల్పుల తిరుపతమ్మ కొబ్బరికాయలు కొట్టి సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ నూతన సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిడెం మోహన్ రావు , కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బాలసాని వేణు, కిరణ్ , నాగేశ్వరరావు, రామక్రిష్ణ , సాగర్, కృష్ణ, మల్లేష్, వినోద్, వేల్పుల నవీన్ తదితరులు హాజరయ్యారు. గ్రామ పెద్దలు, గ్రామస్తుల సమక్షం లో రోడ్డును ప్రారంభించడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ సీసీ రోడ్డును నిర్మించినట్లు గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని సర్పంచ్ జజ్జరి మానస తెలిపారు. భవిష్యత్తులో కూడా గ్రామ పంచాయితీ అభివృద్ధికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్