నూతన గ్రామపంచాయతీ భవనం మరియు మహిళా సమాఖ్య భవనం భూమి పూజ
- సద్దలోనిపల్లి గ్రామంలో
- గ్రామ సర్పంచ్ బెల్లం నర్సింహులు
- గ్రామ ఉపసర్పంచ్ పోతుల నరసింహులు
- వార్డు నెంబర్లు రమేష్, బెల్లం రవి
- ఏఈ బషీర్
గ్రామ సెక్రెటరీ రేణుక.
జోగులాంబ గద్వాల 20 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం సద్దలోనిపల్లి గ్రామంలో నేడు నూతన గ్రామ పంచాయతీ మరియు మహిళా సమైక్య భవనానికి కొబ్బరి టెంకాయలు కొట్టి భూమి పూజ చేయడం జరిగింది. మరియు గ్రామపంచాయతీ 24, 36 ఫిట్ల గలభవనానికి ఎన్.ఆర్.జి .ఎస్ కింద 20 లక్షల రూపాయలు నిధులు మంజూరుకావడంజరిగింది.అలాగే మహిళా సమాఖ్య భవనానికి 10 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగింది అని గ్రామ సర్పంచ్ బెల్లం నర్సింలు, గ్రామ ఉపసర్పంచ్ పోతుల నరసింహులు తెలియజేశారు. గ్రామపంచాయతీ కొన్ని గతం కింద ' పై కప్పు పెచ్చులు 'ఊడి పడుతున్న విషయం అందరికీ తెలిసిందే, ఎన్నో రోజుల కల ఈనాడు భవనానికి భూమి పూజ చేయడం జరిగింది అలాగే గ్రామ పెద్దలు ప్రజలు సంతోషించారు.ఈ కార్యక్రమంలో యు. గోపాల్ మల్లక్కరమేష్, బోయ నడిపి నరసింహులు, పేగుల రామకృష్ణ, రవికుమార్, ఆలయ మాజీ లవన్న, బంట్రో తుకృష్ణ య్య,మల్లక్కమహేష్,గుడిసే నరసింహులు తదితరులు పాల్గొన్నారు.