నిలువ నీడ కరువాయ్యే...

Mar 7, 2026 - 16:12
Mar 7, 2026 - 16:12
 0  1
నిలువ నీడ కరువాయ్యే...

ప్లెక్సీల నీడనే ఆర్టీసి బస్సుల కోసం ప్రయాణికుల నిరీక్షణ

బస్సు షెల్టర్ లేక ప్రయాణికుల ఇక్కట్లు


 జోగులాంబ గద్వాల 7మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- మండుటెండల్లో మలమల మాడుతున్నారు. అకాల వర్షాలతో తడుస్తున్నారు‌. అయిన అధికారుల్లో చలనం కరువాయ్యే. బస్సు షెల్టర్ లు లేక ప్రయాణికులు నరకయాతన పడుతుంటే ఆర్టీసి అధికారులు కాని, జిల్లా ఉన్నతాధికారులు స్పందన కరువాయే. ప్రయాణికుల పడుతున్న నరకయాతన ఎంతోకాలంగా వెల్లువెత్తుతున్నా సంబంధిత యంత్రాంగాలకు చీమకుట్టినట్లు కూడా లేదు. ఈ నేపథ్యంలో గద్వాల పట్టణంలో బస్‌షెల్టర్లు దుస్థితి..ప్రయాణికుల వెతలపై స్పెషల్ స్టోరీ..    జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పాతబస్టాండ్, సర్కార్ హాస్పిటల్, మున్సిపల్ ఆపీస్ తదితర ప్రాంతాలలో ఆర్టీసి బస్సు షెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

శరవేగంగా అభివృద్ది చెందుతున్న గద్వాల పట్టణంలో నిత్యం వేలాది మంది ప్రయాణికులు గద్వాల మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. గద్వాల మీదుగా కర్నూల్, హైదరాబాద్, రాయచూర్, మక్తల్, మంత్రాలయం, అయిజ వివిధ ప్రాంతాలకు ప్రయాణికులు నిత్యం ప్రయాణిస్తుంటారు. ఆర్టీసి బస్సులు వచ్చే సమయం వరకు వేచి ఉండే ప్రయాణికులు బస్ షెల్టర్ లేక ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ప్రయాణించవలసిన పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ అధికారులు ఆర్టీసీ ప్రయాణం సురక్షితం ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలి, అని చెబుతున్న ఆర్టీసీ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో ఆ శాఖ అధికారులు విఫలమైనట్లు ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. దానికి అనుగుణంగా గద్వాలలో పాతబస్టాండ్(విష్ణు ప్రియ హోటల్ ఎదురుగా, ఆపోలో ఫార్మర్సి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్), ప్రభుత్వ ఆసుపత్రి,‌ ఆంధ్రబ్యాంకు ఏటిఎం(మున్సిపల్ ఆపీస్ ఎదురుగా), కొత్త కలెక్టరేట్, తదితర ప్రాంతాలలో బస్సు షెల్టర్ ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గద్వాల జిల్లా ఏర్పడి పదేండ్లు కావొస్తున్న గద్వాల ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల కోసం బస్సు షెల్టర్ లు ముందుకు రాకపోవడంతో శోచనీయం. ప్లెక్సీ నీడనే ఆసర చేసుకుని బస్సుల కోసం నిరీక్షణ చేయాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేధన చెందుతున్నారు. గద్వాలలో ప్రయాణికులు సౌకర్యార్థం అనువైన ప్రాంతాలలో బస్ షెల్టర్ లు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత ప్రయాణికులు కోరుతున్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State