నల్లమల్ల కమలాదేవి సేవలు మరవలేనివి...
సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు
తెలంగాణ సాయుధ పోరాట యోధులు నల్లమల్ల గిరి ప్రసాద్ సతీమణి కామ్రేడ్ నల్లమల్ల కమలాదేవి మరణం సిపిఐ పార్టీకి తీరనిలోటని వారి సేవలు మరవలేని సూర్యాపేట సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ధర్మ బిక్షం భవనంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ సమయంలో ఆయన వెంట ఉండి పనిచేశారని అన్నారు ఆయన సహధర్మచారిగా ఆయన అడుగుజాడల్లో పయనిస్తూ గిరి ప్రసాద్ అజ్ఞాతంలో ఉన్న సమయంలో ధైర్యంతో ఉండి పార్టీ అభ్యున్నతికి పాటుపడ్డారని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త స్ఫూర్తితో ముందుకెళ్లాలున్నారు. వారి మరణానికి జిల్లా పార్టీ పక్షాన విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణం కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, నాయకులు బొమ్మగాని శ్రీనివాస్, చామల అశోక్ కుమార్, మాజీ కౌన్సిలర్ అనంతుల మల్లేశ్వరి, ఎడెల్లి శ్రీకాంత్, దేశ గాని హేమలత తదితరులు పాల్గొన్నారు.