దళిత రత్న అవార్డు అందుకున్న బందెల నరేష్
తిరుమలగిరి 18 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
హైదరాబాదులోని రవీంద్రభారతిలో మంగళవారం రోజున నిర్వహించిన కార్యక్రమంలో సామాజిక సేవకు ప్రతిఫలంగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన బందెల నరేష్ చందు రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న పురస్కార కమిటీ చైర్మన్ అనీల్ కుమార్ చేతుల మీదుగా దళిత రత్న పురస్కారం అందించారు గత 20 సంవత్సరాలుగా సమాజ సేవలో నిమగ్నమై షెడ్యూల్ కులాలు అభివృద్ధి సమితి కార్మిక విభాగంలో కార్మిక అవసరాలను హక్కుల కోసం వారి పిల్లల చదువుల కోసం కృషి చేస్తున్నాడు లేబర్ కార్డు ఇప్పించడంలోనూ దేశం కోసం పోరాటం చేసిన మహనీయుల జయంతి వర్ధంతుల విషయంలోనూ ముందు నడుస్తున్నాడు అందుకే రాష్ట్ర ప్రభుత్వం బందెల నరేష్ దళిత రత్న పురస్కారం అందించింది బందెల నరేష్ చందు మాట్లాడుతూ సమాజ సేవలో ముందు ముందుకు కొనసాగుతానని నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు...