తిరుమలగిరి మున్సిపాలిటీ బిఆర్ఎస్ కైవసం
మున్సిపల్ చైర్మన్ గా రఘునందన్ రెడ్డి
వైస్ చైర్మన్ గా ఏమోజు గోవిందమ్మ
-మున్సిపాలిటీ పై ఎగిరిన గులాబీ జెండా
-మున్సిపాలిటీ లో బిఆర్ఎస్ కోరం
-హాజరైన బిఆర్ ఎస్ కౌన్సిలర్ లు
- కాంగ్రెస్ కౌన్సిలర్లు గైహాజరు
తిరుమలగిరి 17 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగిరింది. తుంగతుర్తి నియోజకవర్గం లో అధికారం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ తిరుమలగిరి మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ ఎస్ పార్టీ 10 వార్డులను గెలిచి తిరుమలగిరి మున్సిపాలిటీ ని బిఆర్ ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. సోమవారం మున్సిపాలిటీ కార్యాలయం లో డిపివో యాదగిరి, మున్సిపల్ కమిషనర్ రాంచందర్ రావు, తహసీల్దార్ హరిప్రసాద్ లు గెలిచిన వార్డు కౌన్సిలర్ లకు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఉదయం సుమారు 11 గంటలకు కేవలం బి ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్లు 9 మంది 1వ వార్డు కౌన్సిలర్ పనికెర లక్ష్మి, 2వార్డు కౌన్సిలర్ జక్కుల రమేష్, 3వ వార్డు కౌన్సిలర్ కారుపోతుల సోమలక్ష్మి, 10వ వార్డు కౌన్సిలర్ భూక్యా యాకుబ్ నాయక్, 11వ వార్డు కౌన్సిలర్ ఎంగోజు గోవిందమ్మ, 12వ వార్డు కౌన్సిలర్ కందుకూరి గీత, 13వ వార్డు కౌన్సిలర్ సంకెపల్లి జ్యోతి, 14వ వార్డు కౌన్సిలర్ సంకెపల్లి రఘునందన్ రెడ్డి, 15వ వార్డు కౌన్సిలర్ పత్తెపురం త్రిషుల్ లు హాజరై ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ లు గైహాజరు అయ్యారు. అనంతరం 12.30 ని. లకు నూతన చైర్మన్ గా సంకెపల్లి రఘునందన్ రెడ్డి ని 10వ వార్డు కౌన్సిలర్ భూక్యా యాకుబ్ నాయక్ ప్రతిపాదించగా, 15వ వార్డు కౌన్సిలర్ పత్తేపురం త్రిషుల్ బలపరిచారు. హాజరైన కౌన్సిలర్ లు ఏకగ్రీవంగా ఆమోదించడంతో 14వ వార్డు కౌన్సిలర్ సంకెపల్లి రఘునందన్ రెడ్డి తిరుమలగిరి మున్సిపల్ నూతన చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ గా గోవిందమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . ...
- తిరుమలగిరి రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ కేంద్రీకరణ
తిరుమలగిరి మున్సిపల్ రాజకీయాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. ఒకప్పుడు స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ… అనూహ్యంగా అవిశ్వాస తీర్మానంతో పీఠం కోల్పోయింది. ఆ పరిణామం అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. అయితే అదే అవిశ్వాసాన్ని సవాల్‌గా తీసుకుని, తాజాగా జరిగిన మున్సిపల్ఎన్నికల్లో 10 స్థానాలు గెలుచుకుని తిరిగి మున్సిపల్ పీఠాన్ని సొంతం చేసుకోవడం గులాబీ పార్టీకి ప్రతిష్టాత్మక విజయంగా నిలిచింది.అవిశ్వాస ఆత్మపరిశీలన,వ్యూహాత్మకమార్పులుఅవిశ్వాస తీర్మానం తర్వాత బీఆర్ఎస్‌లో అంతర్గతంగా ఆత్మపరిశీలన మొదలైంది. వార్డు స్థాయి అసంతృప్తులు, స్థానిక సమీకరణాల్లో వచ్చిన మార్పులు, నాయకత్వంపై వచ్చిన విమర్శలను పార్టీ సీరియస్‌గా తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ నేరుగా రంగంలోకి దిగి శ్రేణులను సమన్వయం చేశారు.వర్గపోరాటాలకు చెక్ పెట్టడం, అసంతృప్త నాయకులను కలుపుకోవడం, బలమైన అభ్యర్థుల ఎంపిక ఈ మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.ప్రచారంలో అభివృద్ధి అజెండాఈసారి బీఆర్ఎస్ ప్రచారంలో ప్రధానంగా అభివృద్ధి అజెండానుముందుకుతెచ్చింది.మున్సిపల్ పరిధిలోపెండింగ్‌లో ఉన్న పనులు, నిధుల వినియోగం, పట్టణ సౌకర్యాల విస్తరణ వంటి అంశాలను ఓటర్ల ముందుంచింది. అవిశ్వాసం రాజకీయ కుట్రల ఫలితమని, ప్రజా అభిప్రాయం మాత్రం తమవైపే ఉందని పార్టీ నాయకత్వం ప్రచారంలో పదేపదే పేర్కొంది.10 సీట్లు… స్పష్టమైన సంకేతం
మొత్తం 10 స్థానాలు గెలుచుకోవడం కేవలం సంఖ్య పరిమితి కాదు. ఇది రాజకీయంగా స్పష్టమైన సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.అవిశ్వాసం తర్వాత బలహీనమవుతుందనుకున్న బీఆర్ఎస్ తిరిగి సమీకృతమై గెలవడం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది.ప్రతిపక్షాలు అవిశ్వాసంతో సాధించిన తాత్కాలిక ఆధిక్యం, ఎన్నికల్లో ప్రజా మద్దతుగా మారకపోవడం వారికో రాజకీయ హెచ్చరికగా మారింది.
- గాదరి కిషోర్ పాత్ర కీలకం
ఈ విజయానికి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ నాయకత్వమే ప్రధాన కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సమీకరణాలను సమర్థంగా నిర్వహించడం,బలమైన వ్యూహంతో ఎన్నికల బరిలో దిగడం, శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావడంఈ అంశాలు ఫలితాన్ని ప్రభావితం చేశాయని విశ్లేషణ.
- ఇక ముందెంత ?
తిరుమలగిరి మున్సిపల్ పీఠం మళ్లీ బీఆర్ఎస్ ఖాతాలోకి రావడంతో పట్టణ రాజకీయ సమీకరణాలు మారాయి. ఈ విజయాన్ని పార్టీ ఎలావినియోగించుకుంటుందన్నది కీలకం. అభివృద్ధి పనుల్లో వేగం పెంచితేనే ఈ ప్రజా తీర్పు స్థిరంగా మారుతుంది.అవిశ్వాసంతో వెనుకడుగు వేసిన బీఆర్ఎస ప్రజా తీర్పుతో ముందడుగు వేసింది. తిరుమలగిరి రాజకీయాల్లో గులాబీ జెండా మరోసారి కేంద్రబిందువైంది.