డాక్టరేట్ పట్టా పొందిన పేదింటి ఆణిముత్యం Dr కమలాకర్
07-03-2026 తెలంగాణ వార్త రిపోర్టర్ చిన్నంబావి మండలం.
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన బెక్కెం వాసి పోతులపల్లి కమలాకర్.
వనపర్తి జిల్లా, చిన్నంబావి మండలం, బెక్కెం (నేలబిల్కు) గ్రామానికి చెందిన రైతు బిడ్డ పోతులపల్లి కమలాకర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం నుండి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఇతడు రైతు దంపతులు అయినా పోతులపల్లి ఈశ్వరమ్మ & శ్రీరాముల ముద్దుల చిన్న కుమారుడు.Dr కమలాకర్ సాగర్
హై ఎఫిషియన్సీ పీవి పవర్ మేనేజ్‌మెంట్ విత్ ఫజ్జీ ఎంపీపీటీ అండ్ హెచ్‌టిఎఫ్‌బి కన్వర్టర్ ఫర్ డ్యూయల్ గ్రిడ్ ఇంటిగ్రేషన్ యూజింగ్ ట్యాబ్ అనే అంశంపై పరిశోధన చేసి విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ పరిశోధనను చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సిబిఐటి) అసోసియేట్ ప్రొఫెసర్ డా. బి. సురేష్ కుమార్ మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ ) అసోసియేట్ ప్రొఫెసర్ డా. జె. ఉపేందర్ వారి పర్యవేక్షణలో పూర్తి చేశారు. పరిశోధన సమయంలో పర్యవేక్షకుల నుండి నిరంతర సాంకేతిక సహకారం, విలువైన సూచనలు మరియు ప్రోత్సాహం లభించిందని పట్టా అందుకున్ననDr కమలాకర్ తెలిపారు.
అలాగే, ఈ పరిశోధన విజయవంతంగా పూర్తి చేయడంలో సహకరించిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ సుశీల మేడం, వైస్ ప్రిన్సిపల్ & బోస్ ప్రొఫెసర్ మంగు సార్, ప్రొఫెసర్ జి. మల్లేశం సార్, ప్రొఫెసర్ శిరీష మేడం గార్లతో పాటు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలోని అందరూ అధ్యాపకులు మరియు సహ పరిశోధకులకు Dr కమలాకర్ సాగర్ దయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, కుటుంబ ప్రోత్సాహం మరియు తన అన్నయ్య పోతులపల్లి చంద్రశేఖర్ మార్గదర్శనం వల్ల ఈ విజయాన్ని సాధించగలిగినట్లు కమలాకర్ పేర్కొన్నారు. బెక్కెం ( నేలబిల్కు) గ్రామం నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా డాక్టరేట్ సాధించిన తొలి వ్యక్తిగా నిలిచిన ఆయనను గ్రామస్తులు, బంధువులు, మిత్రులు మరియు శ్రేయోభిలాషులు అభినందించారు.