టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఆర్డీవో ఆఫీస్ వద్ద నిరసన 

Apr 17, 2026 - 17:30
Apr 17, 2026 - 17:31
 0  8
టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఆర్డీవో ఆఫీస్ వద్ద నిరసన 
టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఆర్డీవో ఆఫీస్ వద్ద నిరసన 

కోదాడ, 17 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త విలేఖరి :-  టీజీఈజేఏసీ రాష్ట్ర, జిల్లా శాఖ పిలుపుమేరకు సూర్యాపేట జిల్లా కోదాడ మండల కేంద్రంలో ఆర్డీవో  కార్యాలయం నందు శుక్రవారం ఆర్డీవోకు వినతి పత్రం అందజేసిన వివిధ ఉద్యోగ సంఘాలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్స్, పిఆర్సి, డి ఏ ఆలస్యం చేయడం వివిధ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అలసత్వాన్ని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసి అనంతరం ఆర్డీవో కి వినతి పత్రం  అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు రావెళ్ల సీతారామయ్య, మట్టపల్లి మహేష్, వెంకట్ నగేష్, విక్రమ్, రాజేష్, జగదీష్, శైలజ, సునీత, దుగ్యాల సతీష్, శ్వేత, పావని, రామిరెడ్డి, తీగల నరేష్, రవీంద్రబాబు, పులి వెంకటేశ్వర్లు, పద్మ, భ్రమరాంబ, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Chandu RC INCHARGE KODADA DIVISION SURYAPET DISTRICT