జోగులాంబా గద్వాల జిల్లా గురుకుల పాఠశాలలో సమన్వయ అధికారి పర్యవేక్షణ
జోగులాంబ గద్వాల 6 మార్చి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. జిల్లాలోని TGSWRS JC Boys IEEJA పాఠశాలను జిల్లా గురుకులాల సమన్వయ అధికారి శోభా రాణి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న వివిధ అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
మొదటగా పాఠశాలలో ఉన్న సమస్యలను ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటర్ విద్యార్థులకు 100 శాతం ఫలితాలు రావాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలని సూచించారు. అలాగే విద్యార్థులకు EAPCET, NEET వంటి పోటీ పరీక్షల కోసం కోచింగ్ ఇవ్వాలని PJL కి సూచించారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తున్నారో అడిగి తెలుసుకొని వారికి మార్గదర్శకత్వం అందించారు. అలాగే పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో సూచనలు ఇచ్చారు.
తదుపరి మెస్ స్టోర్ రూమ్‌ను తనిఖీ చేసి సరుకుల Expiry Dateలను ఒక చార్ట్‌లో నమోదు చేసి గోడకు అతికించాలని సూచించారు.
ముఖ్యంగా TGSWRS పాఠశాలల ప్రిన్సిపాల్స్‌తో జూమ్ కాల్ ద్వారా మాట్లాడి సోషల్ మీడియా ద్వారా పాఠశాల కార్యకలాపాలను చురుకుగా తెలియజేయాలని మరియు ప్రతి రోజు సమాచారాన్ని వెంటనే హెడ్ ఆఫీస్‌కు పంపించాలని ఆదేశించారు.