జూన్ మొదటి వారంలోపు కొనుగోలు పూర్తి చేయాలి మంత్రి
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా మంత్రి. ఎమ్మెల్యే....
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం..
తడిసిన ధాన్యానికి మద్దతు
రెండు రోజుల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు జమ. ..
తిరుమలగిరి 02 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రతి ఒక్క గింజను మా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఇది రైతు ప్రభుత్వం రైతుల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా మీ వెంటే ఉంటామని మీకు భరోసాగా తిరుమలగిరిమున్సిపాలిటీ కేంద్రంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ పరిస్థితులను తెలుసుకొని మీకు లారీలు ఎప్పటికప్పుడు ఎగుమతి చేసిన వారిని దిగుమతి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు అదేవిధంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్వి నందలాల్ పవర్ తో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు అదేవిధంగా అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడి వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేయాలని వారం రోజుల లోపు ధాన్యాన్ని మొత్తం మిల్లులకు పంపించాలని అదేవిధంగా రైతులకు మూడు నాలుగు రోజులలోనే ధాన్యం పైసలు వారి అకౌంట్లో వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. ఒకేసారి వేసవిలో అధికంగా ధాన్యం పంట పండడంతో కేంద్ర ప్రభుత్వం 50% మాత్రమే కొనుగోలు చేస్తుందని ప్రతిమదంతా మా రాష్ట్ర ప్రభుత్వం బరాయిస్తుందని వారు రైతులకు క్షుణ్ణంగా తెలియపరిచారు. మీకు ఆలస్యమైనప్పటికీ ధాన్యాన్ని ఒక్క గింజ లేకుండా కొనుగోలు చేస్తామని వారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మందుల సామిల్ ఎఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిటీ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షది తిరుమలగిరి మార్కెట్ చైర్మన్ మండల పార్టీ అధ్యక్షుడు నరేష్ పలు మండలాల మండల పార్టీ అధ్యక్షుడు గ్రామ శాఖ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.