ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి  గెలిపించండి

Feb 25, 2025 - 19:31
 0  3
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి  గెలిపించండి

తెలంగాణ వార్త వేములపల్లి ఫిబ్రవరి 25 : బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పెద్దమం భరత్  వేములపల్లి మండలం లోని పలు గ్రామాలలోని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పెదమాం భరత్ ఆధ్వర్యంలో మండలం లోని ఉపాధ్యాయులను కలిసి  తాపస్ ఉపాధ్యాయ సంఘం బలపరిచిన  బిజెపి అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి  మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా బీజేపీ మండల అధ్యక్షులు పెదమాం భరత్, జిల్లా నాయకులు చిర్ర సాంబమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సడలింపు ద్వారా ప్రతి ఉపాధ్యాయులకు 25 వేల నుండి 40 వేల వరకు టాక్స్ మినహాయింపు దక్కింది అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక్క DAకూడా పెండింగ్ లేదు అని రాష్ట్ర ప్రభుత్వం  ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ DA లు ఇప్పటివరకు ఆరు వరకు ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సిపిఎస్ రద్దు అని చెప్పి ఇప్పుడు తప్పించుకొని తిరుగుతుందని రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద కొట్లాడే పార్టీ బిజెపి మాత్రమే అని ఇంతకుముందు ఉన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వేనాడు ఉపాధ్యాయ మండల్ లో ప్రశ్నించింది లేదని ఇలాంటివారిని ఓటు వేసిన ఫలితం ఉండదని ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కావాలంటే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బలపరిచిన బిజెపి అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి  మొదటి ప్రాధాన్యత ఓటు వేసే గెలిపించవలసినదిగా వారు కోరారు, ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు కర్ర దామోదర్ రెడ్డి,జవ్వాజి సత్యనారాయణ, పెదమాం ప్రసాద్, బోగారి శ్రీను, నాగేందర్, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333