ఉపాధి కూలీల సమస్యలు  పరిష్కరించాలి , 

 ఫీల్డ్ అసిస్టెంట్ లు  టెక్నికల్ అసిస్టెంట్  లపై చర్యలు తీసుకోవాలి . CPM డిమాండ్ 

Jun 15, 2026 - 18:15
 0  1
ఉపాధి కూలీల సమస్యలు  పరిష్కరించాలి , 
ఉపాధి కూలీల సమస్యలు  పరిష్కరించాలి , 

జోగులాంబ గద్వాల 15 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి.:- ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల సమస్యలు పరిష్కరించాలని, విధుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు,టెక్నికల్ అసిస్టెంట్ల పై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో కలెక్టర్ కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో కూలీలు పని చేయడానికి ముందే వారి యొక్క ఆధార్ సీడింగ్,ఆధార్ అతెంటికేషన్, NPCI మ్యాపింగ్,ఈకేవైసి సక్రమంగా ఉంటేనే పని చేయించుకోవాలని కానీ క్షేత్ర స్థాయిలో కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్లు ఇవేమీ పట్టించుకోకుండా ఫోటో క్యాప్చర్ తీసి, కూలీలతో పని చేయించుకుంటున్నారని, దీనివల్ల కూలీల ఖాతాలో నగదు జమ కావడం లేదని తెలిపారు.కొంతమంది కూలీలు పనిచేసినప్పటికీ రద్దయిన  బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతున్నాయని, ఆ ఖాతాను తిరిగి  కొనసాగిస్తామంటే బ్యాంక్ అధికారులు ఒప్పుకోవడం లేదని, కొత్త బ్యాంకు ఖాతాలను  యాడ్ చేయమంటే సాఫ్ట్ వేర్ తమ వద్ద లేదని అధికారులు చెబుతున్నారని దీనివల్ల కూలీలు పనిచేసిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఆధార్ కార్డులో ఉన్న చిన్న చిన్న తప్పుల వల్ల కూడా కూలీల ఖాతాలో నగదు జమ కావడం లేదని, ఆధార్ సమస్యను పరిష్కరించడానికి తమకు ఎటువంటి సాఫ్ట్ వేర్ ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారని తెలిపారు.కొంతమంది కూలీల ఖాతాలో నగదు జమ అయినట్టుగా ఎంపీడీవో కార్యాలయంలో చూపిస్తున్నప్పటికీ, బ్యాంకు ఖాతాలో మాత్రం నగదు జమ కావడం లేదని తెలిపారు. కొంతమంది కూలీల జాబు కార్డులు ఉన్నపలంగా పనిచేయడం లేదని, అందుకు గల కారణాలను అధికారులు చెప్పడం లేదని తెలిపారు.జాబు కార్డులో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి అవకాశం ఉన్నపట్టికీ ,కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చిన్న చిన్న సమస్యలను సైతం పరిష్కరించకపోవడం వల్ల  మహిళలు, వృద్ధులు,చిన్నారులను తీసుకుని  కలెక్టర్ కార్యాలయం చుట్టు ప్రదక్షిణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లాలో ఇప్పటికీ సుమారు 40 శాతం మంది కూలీలకు ఫోటో క్యాప్చర్ రావడం లేదని ఆ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, తాము ఏమి చేయలేమని అధికారులు చెప్పడం అన్యాయమన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం  చేయడానికి యూనియన్ ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నదో జిల్లా,మండల గ్రామస్థాయి అధికార యంత్రాంగం అంతే శ్రద్ధ తీసుకుంటున్నారని విమర్శించారు. కూలీలతో పని చేయించడం తప్ప కూలీల ఖాతాలో నగదు ఎందుకు జమ కావడం లేదో వారి సమస్యలను పరిష్కరించే తీరిక అధికార యంత్రంగానికి లేదని విమర్శించారు. ధరూరు మండలం పెద్దపాడు వంటి గ్రామాలలో ఇంకా ఉపాధి హామీ పనులు ప్రారంభం కాకపోవడానికి గల కారణాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఉపాధి కూలీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఉపాధి కూలీల ప్రతిఘటనకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు మోష,వెంకటేశ్వరమ్మ ,మేకల చిన్నయ్య,చెట్టుకింద వెంకటన్న,DYFI జిల్లా కన్వీనర్ ఉప్పేర్ అంజి పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333