అభివృద్ధియే మా ప్రధాన లక్ష్యం అంటున్న సంపత్ కుమార్

Feb 4, 2026 - 21:08
 0  1

 జోగులాంబ గద్వాల 4ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  ఐజ  అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతునివ్వండి అభివృద్ధిని ఇంటికి ఆహ్వానించండి

 ఐజ పట్టణ పరిధిలో వివిధ వార్డుల్లో  మునిసిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ . 
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వివిధ వార్డుల్లో తిరుగుతూ అక్కడి ఓటర్లను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాల గురించి వివరిస్తూ  ఈరోజు ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్  ఎన్నికల ప్రచారం నిర్వహించారు .

ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ 

గత ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని 
ఇందిరమ్మ యిండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఐజ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇప్పటికే 600 ఇండ్లను ఐజ కి ఇచ్చాం అని ఇపుడు పోటీలో ఉన్న 20 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇంకా 600 ఇండ్లు ఐజా పట్టణానికి మంజూరు చేస్తామని సంపత్ కుమార్ తెలిపారు. 

పేదోళ్ల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఐజ పట్టణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం కోసం కొద్ది రోజుల క్రితమే 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలవడం జరిగిందని సంపత్ కుమార్  అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ విద్యావంతులను యువకులను రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది కనుక వారిని గెలిపించి మీ మీ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాల్సిందిగా సంపత్ కుమార్  ఓటర్లను కోరడం జరిగింది.

ఐజ పట్టణంలో హైమాస్టర్ లైట్లు ఏర్పాటు చేసి ఐజను కాంతుల మధ్య నిలబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని అయిజ నీ అభివృద్ధి చేయడం తప్ప మాకు ఇంకో పని లేదు అని ఐజ అభివృద్ధి లక్ష్యంగా ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని సంపత్ కుమార్  అన్నారు 

మున్సిపల్ ఎన్నికల్లో మీ యొక్క విలువైన ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సంపత్ కుమార్ కోరడం జరిగింది. 

మార్చి 30 తర్వాత నుంచి అర్హులందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ సంపత్ కుమార్ గారు తీసుకుంటారు అని తెలిపారు. 

లైట్ కావాలన్నా రోడ్డు కావాలన్నా మోరిగట్టాలన్న బస్సు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా సన్న బియ్యం కావాలన్నా రుణాలు కావాలన్నా అది కేవలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మాత్రమే సాధ్యమవుతుంది కనుక ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా నిలిచి విలువైన ఓట్లు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సంపత్ కుమార్ అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఐజ పట్టణ పరిధిలో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప సింగిల్ విండో మాజీ చైర్మన్ సంకపురం రాముడు రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి , మేడికొండ లక్ష్మీ కాంతారావు , ప్రజల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333