అక్రమంగా ఆవులను తరలిస్తున్న లారీ పట్టివేత
తిరుమలగిరి 07 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్- సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆదేశానుసారం అక్రమ రవాణా నిర్మూలన కై తిరుమలగిరి మండల పరిధిలో తొర్రూర్ - వలిగొండ జాతీయ రహదారి పైన వెలిశాల ఎక్స్ రోడ్ వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలలో బాగంగా బుధవారం తెల్లవారుజామున సమయంలో, వాహనాలు తనిఖీలు చేస్తుండగా. ఒక లారీలో 45 పశువులు, వాటిలో 40 ఎద్దులు, 05 ఆవులు కలిగి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి వద్ద గల పశువుల సంత వద్ద నుండి హైదరాబాదులోని కమ్మేలాలకు తరలిస్తుండగా పట్టుబడి చేసి కేసు నమోదు చేసుకొని, అట్టి పశువులను సంరక్షణ నిమిత్తం రాజపేట వద్ద ఉన్న ధ్యాన ఫౌండేషన్ గోశాలకు తరలించినట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు...