ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు*
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
ఫోటో రైటప్ : జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడు ఒగ్గు సోమన్న
తెలంగాణ వార్త పెన్ పహాడ్ మండలం జనవరి 26; 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మండల కేంద్రంలోని మండల ప్రెస్ క్లబ్ కార్యాలయం ఎదుట ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వగ్గు సోమన్న జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే నేడు సమాజంలో అందరికీ సముచితమైన గౌరవం దక్కుతుందని అన్నారు. 1950 జనవరి 26న రాజ్యాంగ అమలులోకి వచ్చి సబ్బండ వర్గాల ప్రజలకు మేలు చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు ధనియాకుల వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారులు చలగంటి పుల్లారావు,చట్టు వెంకటేశ్వర్లు,ఉపాధ్యక్షులు నల్లగంతుల సైదులు,తుమ్మ కొమ్మ సంజయ్, మచ్చ మహేష్ మీసాల నాగయ్య,బొల్లికొండ వీరస్వామి,నన్నెపంగ నవీన్, గంగారపు హరికృష్ణ, జయరామకృష్ణ,సయ్యద్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.