43వ వార్డులో బిజెపి పార్టీ అభ్యర్థి గెలుపే ధ్యేయంగా పల్స మహాలక్ష్మి మన్సూర్ గౌడ్ ప్రచారం
తెలంగాణ వార్త సూర్యపేట 2026-02-07:
సూర్యాపేట పురపోరులో 43 వ వార్డు బిజెపి పార్టీ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న పల్స మహాలక్ష్మి మనసుర్గౌడ్ గడపగడపకు ప్రచారంలో భాగంగా బిజెపితోనే మార్పు సాధ్యమని వార్డులో ఉన్న సమస్యల పైన ప్రతినిత్యం పోరాడతానని వార్డు ప్రతి మూలన సీసీ కెమెరాలు ఉచిత మంచినీటి సౌకర్యం కల్పిస్తారని వార్డులోని యువతకు ఎల్లవేళలా అండగా ఉంటానని వార్డులో ఎటువంటి అవాంతరాలకు తావులేకుండా చూసుకుంటారని రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇల్లు లేని వారికి ఇళ్లను ఇప్పియుడంలో కూడా కృషి చేస్తానని సమస్యలపై ఎల్లవేళలా పోరాడతానని మీ ఇంటిలో మనిషిగా మీతోనే మమేకమై ఉంటానని ప్రచారంలో భాగంగా తెలిపారు.