సర్వేయర్‌ లేక అవస్థలు పడుతున్న రైతులు

Jun 12, 2026 - 20:49
 0  0
సర్వేయర్‌ లేక అవస్థలు పడుతున్న రైతులు

సర్వేయర్‌ లేక అవస్థలు పడుతున్న రైతులు

వెంటనే భూ సర్వేయర్ లను నియమించాలంటూ జిల్లా అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ మధు మోహన్ కి

వినతిపత్రం అందజేసిన సామాజిక కార్యకర్త శాంతకుమార్


జోగులాంబ.గద్వాల 12 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండలం ఎమ్మార్వో కార్యాలయంలో రెగ్యులర్‌ సర్వేయర్‌ లేకపోవడంతో ఏడాదిన్నర నుంచి రైతులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు మానవపాడు మండల రైతన్నలు భూసర్వే కోసం రైతులు మీసేవలో చలానాలుకట్టినా నెలల తరబడి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు సామాజిక కార్యకర్త శాంతకుమార్  మాట్లాడుతూ ప్రస్తుతం వడ్డేపల్లి మండల సర్వేయర్‌ బ్రహ్మయ్య  అనే అధికారి గడిచిన నెలల వరకు మానవపాడు మండల ఇంచార్జ్ గా ఉన్నా ఇక్కడి రైతులకు ఎలాంటి భూ సమస్యలు  తీరలేదంటున్నారు.సామాజిక కార్యకర్త శాంతకుమార్  గత 20 రోజుల కిందట వడ్డేపల్లి మండలం ఎమ్మార్వో కార్యాలయంలో ఓ రైతు దగ్గర లంచం తీసుకుంటూ అనిశా అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులకు వడ్డేపల్లి రెగ్యులర్ సర్వేయర్ పట్టుబడగా ఇంకా భూ సర్వే సమస్యలు తీరవని వారి బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక సతమతమవుతున్నారని కలెక్టర్ కి వివరించారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333