శ్రీశైలం నిర్వాసితుల కోసం పాదయాత్రతో తిరుపతికి వెళ్లి తిరిగి వచ్చిన పెబ్బేటి నారాయణరెడ్డి

ఆయన కు ఘన స్వాగతం పలికిన శ్రీశైలం నిర్వాసితులు

Mar 20, 2026 - 19:30
Mar 20, 2026 - 19:59
 0  1
శ్రీశైలం నిర్వాసితుల కోసం పాదయాత్రతో తిరుపతికి వెళ్లి తిరిగి వచ్చిన పెబ్బేటి నారాయణరెడ్డి

చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన కాలూరు గ్రామం నుండి

74 సంవత్సరాల వయసులో పెబ్బేటి నారాయణరెడ్డి కాలూరు నుండి

తిరుపతికి శ్రీశైల నిర్వాసితుల కోసం పాదయాత్రతో పోరాటం? 40 ఏళ్ల కల నెరవేరాలన్న ఆశ?

20-03-2026 తెలంగాణ వార్త రిపోర్టర్ చిన్నంబావి మండలం. పాదయాత్రతో ఏడుకొండల వెంకటేశ్వర్ల స్వామిని దర్శించుకుని శ్రీశైలం నిరసితుల ముక్కు చెల్లించి తిరిగి వచ్చిన యాత్రికుడికి ఘన స్వాగతం పలికిన శ్రీశైలం నిర్వాసితులు. తిరుపతి యాత్ర ముగింపు లో భాగంగా పెబ్బేటి నారాయణరెడ్డికి ఘన స్వాగతం పలికిన శ్రీశైలం నిర్వాసితులు.

ఊకోకనే రాలేదు తిరుపతికి, అన్ని గుట్టలను తొక్కుకుంటూ గల మెతుతో వచ్చిన కావున ఎంతమంది అడ్డొచ్చినా, మా లాయర్లకు ఎంతమంది నాయకులు అడ్డుపోయిన పోరాటం ఆగదు, పెబ్బేటి నారాయణరెడ్డి స్ఫూర్తితో ఉద్యోగాల కోసం మరోసారి గళమెత్తిన నిర్వాసితులు. ఈ సందర్భంగా డాగోజీ రావు నారాయణరెడ్డి మాట్లాడుతూ, శ్రీశైలం ప్రాజెక్ట్ కారణంగా నిర్వాసితులైన 67 గ్రామాల ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ భగవంతుని సన్నిధిలోకి పాదయాత్రగా వెళ్లడం ప్రశంసనీయమని అన్నారు. దాదాపు 40 సంవత్సరాలుగా కొనసాగుతున్న పోరాటానికి ముగింపు పలికి, ఉద్యోగాల కల శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో నెరవేరాలని ఆశిస్తూ ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు.  ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులను పలుమార్లు కలిసినా సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో నిర్వాసితులు తీవ్ర నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు.

 ఎన్నో సంవత్సరాలుగా కష్టాలు, కన్నీటి గాథల మధ్య జీవిస్తున్న నిర్వాసితులకు ఇప్పటికైనా ఉద్యోగాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని కోరారు.ఇప్పటికైనా న్యాయం చేయాలి… నిర్వాసితుల గళం!

శ్రీశైలం నిర్వాసితుల సమస్యలను తక్షణమే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితుల సంఘం సభ్యులు దాగోజీ రావు, రంగస్వామి, గూడెం రిపోర్టర్ విష్ణు సాగర్,ఎస్ శ్రీనివాసులు, యాపర్ల దామోదర్ నాయుడు, చెల్లపాడు నరసింహా, శ్రీనివాసులు, జహంగీర్ భాషా, గూడెం రాఘవేంద్ర శెట్టి, బాలస్వామి, శాంతయ్య, రాజు శెట్టి,హోటల్ హుస్సేన్ నాయుడు, శ్రీనివాసులు, తదితరులు నిర్వాసితులు పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State