వీ ఆర్ కే పురం గ్రామపంచాయతీ పరిధిలో అదనపు ట్రాన్స్ఫార్మర్ బిగించిన విద్యుత్ శాఖ
వీ ఆర్ కే పురం గ్రామపంచాయతీ పరిధిలో అదనపు ట్రాన్స్ఫార్మర్ బిగించిన విద్యుత్ శాఖ
*PM JGUA స్కీమ్ ద్వారా మీటర్లు లేని గిరిజనులు ఉచితంగా మీటర్లు పొందగలరు...ADE బి.ఉమారావు.*
నూగురు వెంకటాపురం మండలంలోని అన్ని గ్రామాలలో నిరంతర విద్యుత్ సరఫరాకు *సమ్మర్ యాక్షన్ ప్లాన్* లో భాగంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని *విద్యుత్ శాఖ ఏడిఈ ఉమారావు* పేర్కొన్నారు.
ఈ మేరకు సోమవారం వి ఆర్ కె పురం గ్రామం లో క్రొత్తగా 25 కెవిఎ సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
*ప్రధానమంత్రి దర్తీ అభియాన్ యోజన కార్యక్రమంలో* భాగంగా వాజేడు, వెంకటాపురం మండలాలలోని గిరిజన గ్రామాలలో వెలుగులు నింపడం కొరకు మీటర్లు లేని వారికి ఉచితంగా అవసరం ఉన్నచోట ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ స్తంభాలు వేసి వైర్లు గుంజి సర్వీస్ వైర్ తో పాటు మీటర్లను బిగించడం జరుగుతుందని తెలియజేసినారు
ఈ కార్యక్రమంలో వి ఆర్ కె పురం సర్పంచ్ శ్రీమతి డి రమ్య మాట్లాడుతూ వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్న విద్యుత్ సమస్యలను మరియు కొత్తగ స్తంభాలు పంచాయతీ పరిధిలోని కొన్ని వీధుల్లో ఏర్పాటు చేయాలని ఏడిఈ దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ కార్యక్రమంలో N.వెంకటాపురం విద్యుత్ శాఖ ఏ ఈ హనుమాన్ దాస్, ఏఎల్ఎం ఫరీద్, సర్పంచ్ డి.రమ్య, ఉపసర్పంచ్ పి.రాజేశ్వరి, వార్డ్ మెంబర్ డి.రవి మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.