విద్యార్థులకు యూనిఫామ్ అందజేసిన సర్పంచ్

Jan 23, 2026 - 21:04
Jan 23, 2026 - 21:09
 0  1
విద్యార్థులకు యూనిఫామ్ అందజేసిన సర్పంచ్

 తిరుమలగిరి 24 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:

తిరుమలగిరి మండల పరిధిలోని మర్రికుంట తండా గ్రామపంచాయతీ బోళ్ల తండా మండల పరిషత్ స్కూల్లో విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులను గ్రామ సర్పంచ్ బానోతు రోజా లక్ష్మణ్ నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మర్రికుంట గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పాఠశాలల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ విద్యాభివృద్ధి కోసం తన వంతుగా సహకరిస్తానని అన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సహకారంతో విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తానని అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ విద్యార్థులకు షూ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శాంతయ్య ఉపసర్పంచ్ బానోతు సంధ్యా శ్రీనివాస్ తో పాటు ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్ బుల్లి, గ్రామ శాఖ అధ్యక్షులు బానోతు భాస్కర్ నాయక్, మాజీ సర్పంచ్ దేవా, గ్రామస్తులు బాజు, జేత, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి