వికలాంగుల పెన్షన్ 6వేలు అమలుచేయాలి

May 7, 2026 - 19:29
 0  4
వికలాంగుల పెన్షన్ 6వేలు అమలుచేయాలి
వికలాంగుల పెన్షన్ 6వేలు అమలుచేయాలి

ఎన్.పి.ఆర్.డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
బీబీనగర్ 7 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్.పి.ఆర్.డి యాదాద్రి భువనగిరి జిల్లా బిబినగర్ మండల పరిధిలోని నెమరుగమల,జములాపేట్, జియాపెళ్లి,రాయిరాపేట్,గ్రామాలలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మే1 నుండి 10వరకు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కుంటున్న సమస్యల పైన సర్వే,చేయాలని పిలుపు,జిల్లాలో అడ్డగూడూరులో సర్వే లో పాల్గొని వారి సమస్యలు తెలుసుకొని వనం ఉపేందర్ మాట్లాడారు.గ్రామంలో సదరం సర్టిఫికెట్ యుడిఐడి కార్డ్ ఉన్న గత 5 సంవత్సరాల నుండి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు బాధ్యులు  కొంత మంది ఆవేదన వ్యక్తం చేశారు.ఉపాధి లేక బాధ పడుతున్నారు.ఇందిరమ్మ ఇళ్లు ప్రతి వికలాంగులకి మంజూరు చేయాలని.ప్రభుత్వం వచ్చినాక  వికలాంగులకు 6వేలు ఇస్తామని రెండున్నర సంవత్సరాలు అవుతున్న ఎందుకు ప్రభుత్వం ఇవ్వడం లేదని,తక్షణమే పెన్షన్ పెంచి,కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.గ్రామలలో కమిటీలు చిర్రగూడూర్,జానకిపురం,చౌళ్ళరామారం గ్రామాలలో గ్రామ కమిటీలు ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రామిడి భగవంత రెడ్డి,నెమరగొమల గ్రామ నాయకురాలు తోక రాధా,పంపరి అనురాధ,తోక మల్లేశం,జెములాపేట్ గ్రామ నాయకులు గడ్డం బాలరాజు,చిన్నాల బాలరాజు,సిహెచ్ గణేష్,జీయ్యాపేల్లి గ్రామ నాయకులు ఎండి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333