ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మల్రెడ్డి రామిరెడ్డి
హైదరాబాద్,22 మార్చి 2026 (ఆదివారం) తెలంగాణ వార్త రిపోర్టర్:- ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్ ముస్లిం సోదర సోదరీమణులకు చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ రంజాన్ పండుగ ముందు 30 రోజులు ఉపవాస దీక్షలు చేసిన, పవిత్రంగా జరుపుకునే ఈ రంజాన్ పండుగ అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో,విలసిల్లాలని కోరుకుంటున్నాము అని అన్నారు.అదేవిధంగా సరూర్నగర్ చెరువుకట్ట దగ్గర ఉన్న ఈద్గాకు వెళ్లి ఒకరికొకరు అలింగం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ACP క్రిష్ణయ్య కందికంటి శ్రీధర్ గౌడ్, జైపాల్ రెడ్డి,B.ఆనంద్ గౌడ్, వేణు యాదవ్, కే కిషోర్ గౌడ్, M.d షౌకాతుద్దీన్, M.d షబ్బీర్, కాంగ్రెస్ నాయకులు,ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.