మీసేవ.. డిజిటల్ సేవ

Jun 21, 2026 - 00:26
Jun 21, 2026 - 00:30
 0  2
మీసేవ.. డిజిటల్ సేవ

మీసేవ కేంద్రాల్లో నేటి నుంచి డిజిటల్ రసీదుల విధానం

కాగితపు రసీదులకు ఇక చెల్లు

దరఖాస్తుదారుడి మొబైల్కె అక్నౌలెడ్జిమెంట్ హైపర్ లింక్

పొరపాటున డిలిట్ అయితే తిరిగి పంపించే వెసులుబాటు

సూర్యపేట, 20 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- మీసేవ కేంద్రాల్లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇచ్చే కాగితపు రసీదులకు కాలం చెల్లింది. పేపర్ లెస్ పాలనలో భాగంగా జిల్లాలోని 90 మీ సేవ కేంద్రాల్లో శుక్రవారం నుంచి డిజిటల్ రసీదుల విధానం అమల్లోకి రానుంది. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (మీసేవ) కమిషనర్ ఆదేశాల మేరకు.. ఇకపై కాగితపు ప్రింట్లకు బదులుగా దరఖాస్తుదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబరు ఎస్ఎంఎస్ ద్వారా అక్నాలెడ్జ్మెంట్ హైపర్ లింక్ పంపనున్నారు. పాత పద్ధతిలో ప్రింట్ ఇస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

మొబైల్ కే రశీదు లింక్..

కొత్త విధానం ప్రకారం.. మీసేవ కేంద్రంలో దర ఖాస్తు చేసుకున్న వెంటనే, దరఖాస్తుదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో అప్లికేషన్ నంబర్, సేవ పేరు, చెల్లించిన ఫీజు వివరాలతో పాటు ఒక హైపర్ లింక్ ఉంటుంది. పౌరులు ఆ లింక్ పై క్లిక్ చేసి తమ అక్నాలెడ్మెంట్ రశీదును ఎప్పుడైనా వీక్షించవచ్చు. డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు. సర్టిఫికెట్ చేతికి వచ్చే వరకు ఈ ఎస్ఎంఎస్ సురక్షితంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. దీనివల్ల కాగితాలు పోగొట్టుకునే భయం ఉండదు.

అందుబాటులో రీ సెండ్ ఆప్షన్..

మొబైల్కు వచ్చిన ఎస్ఎంఎస్ పొరపాటున డిలిట్ అయినా లేదా పోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీసేవ అప్లికేషన్ లో సదరు ఎస్ ఎం ఎస్ తిరిగి పంపించే సౌకర్యాన్ని కల్పించారు. దరఖాస్తుదారులు కోరితే ఆపరేటర్లు మళ్లీ మెసేజ్ పంపేలా సహాయం అందిస్తారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కొత్త నిబంధనల ప్రకారం.. జిల్లాలోని మీసేవ నిర్వాహకులు, ఆపరేటర్లు దరఖాస్తు దారుల నుంచి కచ్చితమైన, యాక్టివ్ ఉన్న మొబైల్ నంబర్లను మాత్రమే సేకరించాల్సి ఉంటుంది. జూన్ 19 నుంచి ఎలాంటి ఫిజికల్ (కాగితపు) రసీదులను ప్రింట్ తీసి ఇవ్వకూడ దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘించి పాత పద్ద తిలోనే కాగితపు రశీదులు జారీ చేస్తే జిల్లా లోని సదరు కేంద్రాలపై కఠిన చర్యలు ఉం టాయని ఐటీ, ఈఎస్ఇ కమిషనర్ ఉత్తర్వు లుల్లో హెచ్చరించారు. అప్లికేషన్ ఇచ్చే టప్పుడు ప్రస్తుతం వాడుకలో ఉన్న కరెక్ట్ మొబైల్ నంబర్ను మాత్రమే ఇవ్వాలని, లేదంటే భవిష్యత్తులో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కష్టమవుతుందని అధికారు లు స్పష్టం చేశారు.

కాగిత రహిత పాలనే ధ్యేయం

కాగిత రహిత పాలనే ధ్యేయంగా నూతన విధానం అమలు చేస్తున్నాం. దీనికి సంబంధించిన ఉత్తర్వు లను ఇప్పటికే మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు అందజేశాం. మీ సేవ కేంద్రాల్లో పేపర్ రసీదు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలుకుతున్నాం.

- , మీ సేవ e జిల్లా మేనేజర్
- G గఫ్ఫార్ అహ్మద్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333