మట్టి ఇసుక అక్రమ తరలింపు.

Jun 7, 2026 - 23:16
Jun 7, 2026 - 23:41
 0  3
మట్టి ఇసుక అక్రమ తరలింపు.
మట్టి ఇసుక అక్రమ తరలింపు.
మట్టి ఇసుక అక్రమ తరలింపు.

జోగులాంబ గద్వాల7 జూన్ తెలంగాణవార్త ప్రతినిధి:- తుంగభద్ర నది నుంచి ఇసుక. ప్రభుత్వ భూములు నుంచి మట్టి. ఎర్ర మట్టి వంటివి టిప్పర్లతో రాత్రి పగలు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మైనింగ్ అధికారుల నుంచి. నామమాత్ర అనుమతులు తీసుకొని. ఒక దగ్గర తీసుకొని మరొకచోట జెసిబి సహాయంతో తోడేస్తూ అక్రమంగా తరలిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. పోలీసు మైనింగ్ రెవెన్యూ శాఖ అధికారులు ముందరగానే మాట్లాడుకుని. ఎవరి వాటా వాళ్లకి ముట్టజెప్పి మట్టిని తరలించకపోవడం జరుగుతుందనేది తెలుస్తుంది. తుంగభద్ర నదిలో నీళ్లు లేనందున ఇసుకను తరలించేందుకు అణువుగా మారింది. మట్టిని కూడా దళారులు నామమాత్రంగా అనుమతులు తెచ్చుకొని దోపిడీ చేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడ అవసరమున్న చోటికి తరలించి సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. ఎవరు నుంచి అడ్డంకులు రాకుండా ముందుగానే మాట్లాడుకొని. మట్టి ఇసుక. రవాణా సాగుతుంది. ఎస్సై నుంచి డిఎస్పి వరకు మామూలు చేరుతున్నట్లు సమాచారం. రెవెన్యూ మైనింగ్. జిల్లా అధికారుల వరకు ఇచ్చి తెచ్చుకోవాల్సిందే అనే నానుడి ఉంది. ఇలాగ ప్రతిదానికి ఒక లెక్క ఉండడంతో అధికారులు రాత్రి పగలు మట్టి ఇసుక టిప్పర్లు రవాణా చేస్తున్న పల్లెతి కూడా పలకరించకపోవడం తో ఉన్న అంతర్వేమిటి అన్ని ప్రశ్నిస్తున్నారు. ఇలాగ నెల నెలలు ప్రకృతి సంపదను తరలించుకొని వెళ్తుంటే. సంపద త రీ గీ పోయి డిమాండ్ పెరుగుతుంది. అక్రమార్కుల చేతిలో సంపద వెళుతుంది. కానీ ప్రకృతి ఖనిజ కరిగిపోవడం వలన భవిష్య తరాలకు అందరి పరిస్థితి ఏర్పడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖనిజ సంపదను కాపాడుకోవడానికి. వాల్టా చట్టాన్ని తీసుకొచ్చిన. చట్టాన్ని కాపాడడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నతాధికారులు పూర్తిగా విప్లమయ్యారని విమర్శలున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. భవన నిర్మాణదారులు. అభివృద్ధి పనులకు ఇసుక మట్టి ఎంతో అవసరం. దూరాన్ని బట్టి. ఇసుక టిప్పర్ 30000 నుంచి 50 వేల వరకు డిమాండు ఉంది. మట్టి ఎర్ర మట్టి. రోడ్లకు. ఇంటి బేస్మెంట్ పునాదికి మట్టి ఎంతో అవసరం. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అధికారుల జేబులోకి వెళ్లడంతో దళారులు సొమ్ము చేసుకుని అధికారులు దళారులు బాగుపడుతున్నారు. ప్రభుత్వానికి గండి కొట్టి భవిష్యత్ తరాలకు ఖనిజ సంపద దొరకని పరిస్థితి కనబడుతుంది. నది తీర గ్రామాల్లోని దళారులు ఎక్కువగా అక్రమ ఇసుక మట్టి దందా నడిపిస్తున్నారు. ఏదేమైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఆదాయం పెంచి ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నదని చెప్పవచ్చు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State