బియ్యం  షుగర్ లెవెల్స్  పెo చుతాయనేది వాస్తవం.* అయితే

Aug 22, 2025 - 18:18
 0  1

  షుగర్ పెరగడానికి గల ఇతర కారణాలను  తెలుసుకొని,  తినే పద్ధతిలో మార్పులు చేసుకుంటే  చింత అవసరంలేదంటున్న  నిపుణులు.* గ్లైసిమిక్ ఇండెక్స్  లోతెరిగి  లైఫ్ స్టైల్ మార్చుకుంటే వర్రీ లేదు.*
**************
---  వద్దేపల్లి మల్లేశం  9014206412 
----17....07....2025********
షుగర్ వ్యాధితో బాధపడే వాళ్లకు మరీ అన్నం తినాలని ఎంత ఆరాటం ఉంటుందో అంత బెంగ కూడా  వాళ్లకు  జీవిత సమస్యగా మారుతున్నది.  గతానికి ఇప్పటికీ అనేక రకాలైనటువంటి సాంకేతిక అంశాలు  లోతైన పరిజ్ఞానం  మినహాయింపులు ప్రత్యామ్నాయాలు  ఆహారంలో  షుగర్ లెవల్స్ ను తగ్గించే  రకరకాల బియ్యం  అందుబాటులోకి రావడంతో  వరి అన్నముతో  తమ జీవితమే వృధా అవుతుందనుకునే వాళ్లకు కొంత ఉపశమనం కలిగినట్లే. అయితే జీవన విధానాన్ని మార్చుకోవడం తోపాటు సానుకూల దృక్పథం కలిగి ఉండి అంది వచ్చిన ఆధునిక  అవకాశాలను ఉపయోగించుకోవడం ద్వారా  షుగర్ ఉన్నప్పటికీ భద్రంగా బతకవచ్చు అనేది  నేటి వాదన. మరి అన్నముతో షుగర్  షుగర్ లెవెల్స్ పెరుగుతే ప్రమాదమని భయపడుతున్నటువంటి వారికి నష్టము, అంతా భయపడవలసిన అవసరం లేదని  భరోసా ఇస్తున్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది.  ప్రపంచంలో, భారతదేశంలో  సుమారు 50 శాతానికి పైగా ప్రజలు వరిని ఆహారంగా తీసుకుంటున్న నేపథ్యంలో  మితాన్ని పాటిస్తూ  మూడు పూటలు  అన్నము తింటూ ఆరోగ్యంగా ఉన్న వారిని చూడవచ్చు. అదే సందర్భంలో  వ్యాయామానికి దూరంగా, వ్యతిరేక ఆలోచనలతో జీవన విధానాన్ని మార్చుకోని వాళ్లలో ఈ ప్రమాదం మరీ ఎక్కువగా కనపడుతున్నది. అన్నం పూర్తిగా మాని వేయడం కంటే  కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవడం ద్వారా  చెక్ పెట్టవచ్చు. అలాగే షుగర్ లెవెల్స్ ను  ఎంత వేగంగా పెంచుతాయి అనే ఆధారంగా  ఆహార పదార్థాలను  విభజించిన సందర్భంలో  ఇండెక్స్ తక్కువగా ఉన్నటువంటి బ్రౌన్ రైస్, మి ల్లెట్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడంతో పాటు    ముడి బియ్యము,  నల్ల బియ్యము, ఎర్ర  బియ్యము, బాస్మతి బియ్యము,  రైస్ తో పాటు మిల్లెట్స్  అధికంగా తీసుకోవడం ద్వారా  షుగర్ పెరగకుండా చెక్ పెట్టవచ్చు.
షుగర్   పెరగడానికి ఇతర కారణాలు తెలుసుకోవాలి
**************
  శారీరక శ్రమ తగ్గడంతో పాటు   జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ  ఫుడ్స్ కూడా కారణం. వ్యాయామాన్ని  కుదించడం, జీవనశైలిలో వస్తున్న మార్పులు, ఆధునిక  ఆలోచనల పేరుతో తప్పిదాలు  షుగర్ లెవెల్స్ పై దుష్ప్రభావాన్ని కలిగిస్తున్నాయి.  సకాలంలో తినకపోవడం,ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం,  రాత్రి మరి ఆలస్యంగా భుజించడం, నిదానంగా కాకుండా వేగంగా తినడం వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉన్నది అని  నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ఊబకాయం కలిగి ఉండడం వారసత్వ లక్షణాలు కూడా  ప్రధాన పాత్ర పోషించగా  గ్లైసిమిక్ ఇండెక్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తరచుగా తినడం కూడా  నివారించలేని స్థాయిలో షుగర్ పెరగడానికి కారణాలని నిపుణులు  పరిశోధన ద్వారా  వెల్లడిస్తున్నారు.
  గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏమిటి  ఏబియ్యంలో  ఎంత శాతం?
****************
ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలో  షుగర్ స్థాయిని ఎంత త్వరగా పెంచుతుందో కొలిచే సూచిక  గ్లాయిసమిక్ ఇండెక్స్ G.I. ఎక్కువ గ్లైసిమిక్  ఇండెక్స్ కలిగిన ఆహార పదార్థాలు  రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయని  కొలమానం 0 నుండి 100 వరకు కలిగి ఉంటుందని  వ్యవసాయ శాస్త్రవేత్తలు  ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్   సత్యనారాయణ గారు  తమ పరిశోధన ద్వారా తెలియజేస్తున్నరు.  బియ్యం రకం   ఆహారం తీసుకొనే విధానాన్ని బట్టి  ఆహార పదార్థాలలోని జిఐ స్థాయి మారుతుంది.  ముడి బియ్యం నల్ల బియ్యం ఎర్ర బియ్యం బాస్మతి  బియ్యంలో జి ఐ స్థాయి  త క్కువగా ఉంటుందని  నిత్యం వాడుకునే బియ్యం రకాలలో  జిఐ స్థాయి కొంత ఎక్కువగా ఉంటుందని  నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో  జి ఐ స్థాయి తక్కువగా ఉన్నటువంటి  బియ్యం రకాలు కూరగాయ  ఇతర ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం ద్వారా  షుగర్ ను  అదుపు చేయడానికి అవకాశం ఉందని గ్రహించాలి.
      అంతేకాకుండా తినడానికి కూడా పద్ధతి ఉందని  మిశ్రమహారాన్ని తీసుకోవడం ద్వారా  షుగర్  అదుపులో ఉంచుకోవచ్చునని  డాక్టర్ పి వి సత్యనారాయణ గారు  తన పరిశోధన ద్వారా  ఈ క్రింది విధంగా  ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచించడం  షుగర్ పీడితులకు ఎంతో తోడ్పడుతుంది.
--    అన్నము తో పాటు  పప్పులు కూరగాయలు  నెయ్యి  గింజ ధాన్యాలను కలిపి తీసుకుంటాము కనుక  అంతగా భయపడవలసిన పని లేదు.
--  అన్నం పరిమిత స్థాయిలో తీసుకోవడంతో పాటు  మిశ్రమాహారం సమతుల ఆహారాన్ని  తీ సుకోవడం, వ్యాయామం  చేయడం ద్వారా కూడా  ఆందోళన నుండి బయటపడవచ్చు.
---  ఆలస్యంగా తినడంతో పాటు  సిరి ధాన్యాలను ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లయితే  చక్కర స్థాయిని నియంత్రించవచ్చు.
---  వయస్సును,  శారీరక శ్రమను,  తీసుకునే ఆహారం యొక్క రకాన్ని బట్టి  అన్నం పరిమాణంలో మార్పులు చేసుకుంటే  అదుపులోనే ఉంటుందని విజ్ఞుల అభిప్రాయం.
--  ముఖ్యంగా అన్నంలో నిమ్మరసాన్ని కలుపుకొని తినడం వలన  గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వలన షుగర్ లెవెల్ పెరగదు.  మా o సకృత్తులు పీచు  ఉన్నటువంటి కూరగాయలు,ప ప్పులు, గింజ ధాన్యాలు  ఆహారంలో బాగం చేసుకోవడం  వలన    గ్లూకోజ్ విడుదల  వేగం తగ్గుతుంది.
ముఖ్యంగా బేకరీ, స్వీటు , ఆలుగడ్డలు, చక్కర తీ పీ పదార్థాలు  జి ఐ లెవెల్స్ ను ఎక్కువగా కలిగి ఉంటే  బెండకాయ, పప్పులు, గోధుమ రొట్టె,పచ్చ అరటి, కూరగాయలు,  గింజ ధాన్యాలు  తక్కువ జి ఐ కలిగి ఉంటాయని  నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో  సమయోచితంగా సమయస్ఫూర్తిగా  ఆహారాన్ని తీసుకునే క్రమంలో వరిని  ప్రణాళిక బద్ధంగా  బాగం చేసుకోవడం ద్వారా  వరి నుండి  సంభవించే పెనుముప్పు అనే  మానసిక  క్షో భ నుండి బయటపడడానికి ఆస్కారం ఉన్నది.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడుహుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333