*బాల్య వివాహాలు అరికట్టాలి*

Apr 30, 2026 - 19:48
 0  0
*బాల్య వివాహాలు అరికట్టాలి*

*బాల్య వివాహాలు అరికట్టాలి* 

 తెలంగాణ వార్త వాజేడు ఏప్రిల్ 30 :-

వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామంలో సఖి సెంటర్ కౌన్సిలర్ కల్పన ఆధ్వర్యంలో పదహారు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల మధ్య బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు., సమావేశంలో స్థానిక సర్పంచ్ బోధెబోయిన భరత్ కుమార్ మాట్లాడుతూ చట్టపరంగా పద్దెనిమిది సంవత్సరాల నిండక ముందు వివాహాలు చేయడం వలన బాలికలకు ఆరోగ్య, విద్య, ఆర్దికంగా సమస్యల తలెత్తుతాయి, ఇది ఒక బాధ్యత రహితమైన హానికర సాంప్రదాయమని ఇది చట్ట రీత్యా నేరమని ఆయన వివరించారు, సమాజంలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిపితే వారిపై విచారణ చేపట్టి కేసులు నమోదు చేయించే అధికారం అందరికి ఉంటుందని ఆయన తెలిపారు ,

ఎవరైనా 18 సంవత్సరాల దాటక ముందు పెళ్ళిళ్ళు చేస్తున్నట్లు తెలిస్తే ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, సెక్రటరీలకు ముందస్తు సమాచారం ఇచ్చినట్లఐతే పై అధికారులు కు తెలియజేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని అవగాహన కల్పించారు. సమావేశంలో సఖి సెంటర్ కౌన్సిలర్ కల్పన, అంగన్వాడీ టీచర్ విజయ, ఆశ వర్కర్ మాలతి, వార్డుమెంబర్లు , గ్రామస్తులు, యువతీ యువకులు,తదితరులు పాల్గొన్నారు

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్