ఫోన్ దొంగిలించి మని యాప్ ల ద్వారా డబ్బులు దొంగిలిస్తున్న ముఠా ను అరెస్ట్

చేసిన సూర్యాపేట జిల్లా సిసిఎస్, తుంగతుర్తి పోలీస్.

Jun 12, 2026 - 00:13
Jun 12, 2026 - 00:49
 0  0
ఫోన్ దొంగిలించి మని యాప్ ల ద్వారా డబ్బులు దొంగిలిస్తున్న ముఠా ను అరెస్ట్
ఫోన్ దొంగిలించి మని యాప్ ల ద్వారా డబ్బులు దొంగిలిస్తున్న ముఠా ను అరెస్ట్

- రైతుకు అండగా సూర్యాపేట పోలీస్.
- రైతు బ్యాంక్ అకౌంట్ నుండి దొంగతనానికి గురైన రూ.1,80,000/- సొత్తు రికవరీ.
- మరో వ్యాపారి అకౌంట్ నుండి దొంగతనానికి గురైన రూ.90 వేల నగదు రికవరీ.
- నిందితుల మొత్తం 2 లక్షల 70 వేల నగదు, 27 స్మార్ట్ ఫోన్స్, ఒక కారు స్వాధీనం.
- బస్సుల్లో ప్రయాణం చేస్తూ ప్రయాణికుల మొబైల్స్ ను దొంగతనం చేసి ఫోన్ లో ఉన్న మని యాప్ యూపిఐ ల సీక్రెట్ పిన్నులను గుర్తించి డబ్బులు దొంగతనం చేస్తున్న నిందితులు.

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు నిందితుల అరెస్టు వివరాలు నగదు రికవరీ వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు.

కేసు వివరాలు: Cr.no.81/2026 & Cr.no.63/2026 తుంగతుర్తి పి‌ఎస్
నిందితుల వివరాలు:
A1. పాముల రాము @ ఎరుకల రాము, వయస్సు: 23 సంవత్సరాలు, వృత్తి: సెంట్రింగ్ పని, నివాసం: డోన్ విలేజ్ మరియు మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్.
JCL-1. మైనర్ బాలుడు, నిజామాబాద్ జిల్లా, ప్రస్తుత నివాసము నంద్యాల జిల్లా డ్రోన్ గ్రామం.
JCL-2. ఒరిస్సాకు చెందిన మైనర్ బాలుడు.

....

సూర్యాపేట 12 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన రైతు ఉప్పల ఉప్పలయ్య గత నెల 22వ తేదీన సూర్యాపేట నుండి తుంగతుర్తి మీదుగా అన్నారం గ్రామానికి బస్సులో వెళ్లే సమయంలో మార్గం మధ్యలో సెల్ ఫోన్ దొంగతనానికి గురైంది, తుంగతుర్తి వచ్చిన తర్వాత ఫోన్ చూసుకుంటే కనిపించలేదు ఫోన్ పోయినది అని గుర్తించాడు. వరి ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయి, ఫోన్ దొంగిలించిన వ్యక్తులు అదే రోజు రైతు ఫోన్ లో ఉన్న మని యాప్ యూపిఐ ల పిన్ నంబర్ గుర్తించి, దాని ద్వారా దఫాల వారీగా 1 లక్ష 80 వేల రూపాయలు డబ్బులు నిందితుల తెలిసిన వారి వివిధ అకౌంట్ లలోకి పంపి డ్రా చేసినారు. దీనిపై తుంగతుర్తి పీస్ నందు బాధితుడు పిర్యాదు చేసినాడు. మరొక వ్యక్తి తుంగతుర్తి గ్రామానికి చెందిన వ్యాపారి దుగ్యాల వెంకటేశ్వరరావు తుంగతుర్తి నుండి సూర్యాపేటకు బస్సులో వెళ్లే క్రమంలో వేలుగుపల్లి గ్రామ శివారులో వెళ్ళేసరికి అతని ఫోన్ దొంగతనానికి గురైంది, ఇతని బ్యాంక్ లో ఉన్న డబ్బు రూ.97800/- మని యాప్ ల ద్వారా ఇతర అకౌంట్ లకు పంపి దొంగతనం చేసినారు. దీనిపై తుంగతుర్తి పీస్ నందు బాధితుడు పిర్యాదు చేయగా ఐటి చట్టాల ప్రకారం రెండు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైతుకు న్యాయం చేయాలి ఆరుగాలం కష్టపడి సంపాదించిన డబ్బులు రికవరీ రైతుకు ఇవ్వాలనే సంకల్పంతో కేసు దర్యాప్తు చేశాము.

కేసు దర్యాప్తులో ఉండగా, పోలీస్ శాఖ సాంకేతికత ఆధారాలు ఇతర ఆధారాల ద్వారా ఈ రోజు అనగా తేదీ:11.06.2026 ఉదయం 09.30 గంటల సమయంలో తుంగతుర్తి సబ్-ఇన్‌స్పెక్టర్, జిల్లా సి.సి.ఎస్ సిబ్బంది కలిసి తుంగతుర్తి బస్టాండ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో తుంగతుర్తి వైపు నుండి ఒక మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు (నెంబర్: TS12EJ9817) పై అనుమానం వచ్చి తనిఖీ చేయగా, అందులో ఉన్న ముగ్గురు (03) నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నంద్యాల జిల్లా డ్రోన్ గ్రామానికి చెందిన సెంట్రింగ్ పని చేసే పాముల రాములు అలియాస్ ఎరుకల రాము గా గుర్తించడం జరిగినది. ఇతనితోపాటు కారులో మరో ఇద్దరు మైనర్లను గుర్తించడం జరిగినది. ఈ నిందితులు గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు ఉండే బస్టాండ్ ల  ప్రయాణికుల ను లక్యంగా చేసుకుని మొబైల్ ఫోన్లను దొంగతనం చేస్తారు. బాధితులు తమ ఫోన్లకు సులభంగా ఊహించగలిగే స్క్రీన్ లాక్ పిన్ (PIN) లేదా గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (PhonePe), పేటిఎం (Paytm) లాంటి యాప్‌లకు సులభమైన యూపీఐ పిన్ (UPI PIN) (ఉదాహరణకు: 0000, 1234, 123456, 2580, 1111) పెట్టుకుంటే, నిందితులు వాటిని తెరుస్తారు. ఆ యాప్స్ ద్వారా పెట్రోల్ బంకులు మరియు బట్టల దుకాణాలకు డబ్బులను బదిలీ (Transfer) చేసి, ఆయా వ్యాపార సంస్థల నుండి నగదును చేతికి తీసుకుంటారు.

ఇదే పద్ధతిలో తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన రైతు ఉప్పల ఉప్పలయ్య యొక్క మొబైల్ ను దొంగలించి  మొబైల్ ఫోన్ లో ఉన్న మని యాప్ పిన్ గు గుర్తించి దాని ద్వారా ₹1,80,000/- దొంగిలించారు, తుంగతుర్తి కి చెందిన వ్యాపారి దుగ్యాల వెంకటేశ్వరరావు ఫోన్ దొంగిలించిన ఫోన్ ద్వారా ₹97,000/- చొప్పున మోసపూరితంగా బదిలీ చేసి దొంగిలించారు. 2 లక్షల 70 వేల నగదు, 27 సెల్ ఫోన్లు, ఒక  కారు స్వాధీనం చేసుకోవడం జరిగినది.
బస్సులలో ప్రయాణం చేసే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని మొబైల్ ఫోన్లను దొంగలించి ఆ ఫోన్లో ఉన్న మనీ యాప్ ల యొక్క పిన్ నెంబర్లను చేధించి తద్వారా తెలిసిన వారి అకౌంట్లకు డబ్బులు బదిలీ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. కావున ప్రజలు బ్యాంక్ ఖాతాలు ఉపయోగించే మొబైల్ లకు బలమైన సీక్రెట్ పాస్వర్డ్ ను పెట్టుకోవాలని, అలాగే మనీ యాప్లకు కూడా సాధారణ పిన్ నెంబర్లు 1234 లాంటివి, ఫోన్ నెంబర్లు, పుట్టిన తేదీలు కాకుండా బలమైన పిన్ నెంబర్లను పెట్టుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాము.

కేసు పర్యవేక్షణ చేసిన డిఎస్పీ ప్రసన్న కుమార్ ను, కేసు చేదనలో బాగా పని చేసిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్ఐ యాదవేందర్ రెడ్డి, హరికృష్ణ, తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్, పోలీస్ టెక్నికల్ టీం ఆర్ఎస్ఐ రాజశేఖర్, ఏఎస్ఐ వెంకన్న, హెడ్ కానిస్టేబుల్ సాగర్ రావు,  కానిస్టేబుల్ మల్లేష్, ఆనంద్, శివ, సతీట్, ప్రభాకర్, మహేష్, సైదులు, రవి లను ఎస్పి గారు అభినందించి రికార్డ్స్ అందించారు జరిగినది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333