ప్రైవేట్ స్కూళ్ల దోపిడీని అరికట్టాలి

Jun 20, 2026 - 23:08
Jun 21, 2026 - 00:29
 0  1

ఐజ మండల ఎంఈఓ కి వినతి

బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

ఫీజుల నియంత్రణ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరమైన విఫలం.

కార్పొరేట్, ప్రయివేట్ స్కూళ్లకు కొమ్ము కాస్తున్న రేవంత్ రెడ్డి. 

జోగులాంబ గద్వాల 20 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం BRSV రాష్ట్ర పిలుపుమేరకు జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓ లకు ప్రైవేటు స్కూల ఫీజులు దోపిడీని నియంత్రించాలి మరియు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని వినుతిపత్రం ఇవ్వడం జరిగింది 

అందులో భాగంగానే ఐజ మండలంలోని ప్రైవేటు స్కూల్లో వసూలు చేస్తున్న ఫీజుల దోపిడిని అరికట్టాలి మరియు మండలంలోని ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంఈఓ గారికి బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా పెంచుతున్న ఫీజులను వెంటనే నియంత్రించాలని కోరుతూ ఎంఈఓ కార్యాలయలలో వినతి పత్రాలను అందజేయడం జరిగింది. 

 కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అన్యాయం చేస్తుందని విద్యాశాఖ మంత్రి, స్వయానా ముఖ్యమంత్రి అయినప్పటికీ విద్యా విధానంలో చాలా లోపాలు ఉన్నాయి అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఫీజుల నియంత్రణ చేయకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినారు. అనంతరం ఎంఈఓ రాములు కి వినతి పత్రం సమర్పించారు. ఫీజుల పేరుతో యాజమాన్యాలు చేస్తున్న దోపిడీని అరికట్టి, పేద విద్యార్థులకు భారం లేకుండా చూడాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

అదేవిధంగా ప్రభుత్వ బడులను మూసి వేయడం మానుకోవాలని అన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలను కచ్చితంగా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న 27 పాఠశాలలను 4 వేలకు కుదిస్తానని అనడం ఇది విద్యా వ్యవస్థకే సిగ్గుచేటు మాయని మచ్చ. ఇది ముఖ్యమంత్రి వచ్చిన మూర్ఖత్వపు ఆలోచన దీన్ని తక్షణమే విరమించుకోవాలి అని అన్నారు.

 అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న పదివేల కోట్లకు పైగా విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి అదేవిధంగా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టంను అమలు చేయకపోతే భవిష్యత్తులో బీఆర్ఎస్వి విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో విద్యార్థి నాయకులు నరేష్ రంగస్వామి,తులసి గౌడ్, రాజు రమేష్, ప్రవీణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State