పాలన చేతకాక... అక్రమ నిర్బంధాల పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి
నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్
బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
జోగులాంబ గద్వాల 18 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :- ఈరోజు హైదరాబాదులో నిరుద్యోగులు విద్యార్థులు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడిలో భాగంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్యను ముందస్తుగా గద్వాల జిల్లా కేంద్రంలోని వారి నివాసంలో అరెస్టు చేసి గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్బంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ...
* 20 వేల పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ వేయాలి
* 25 వేల ఉద్యోగాల తో కూడిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి.
* ప్రభుత్వ పాఠశాలను మూసివేసే ఆలోచనను విరమించుకోవాలి. ప్రభుత్వ బడులను మూసివేయడం దుర్మార్గం. ఈ రాష్ట్రంలో ఉన్న 27 వేల పాఠశాలలను 4 వేలకు కుదిస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం ఇది కుట్రపూరితం. ఇది బడుగు బలహీన వర్గాల బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ బిడ్డలను విద్యకు దూరం చేయడమే
* ఇది ప్రైవేటు బడులను ప్రోత్సహించే విధానానికి రెడ్ కార్పెట్ పరుస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్
* అరెస్ట్ లు చేసినంత మాత్రాన నిజాలను దాచలేరనీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నిరుద్యోగుల విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్నారని అన్నారు.
* విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, ఇలా అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిదర్శనం.
* అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు.. నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు పోరాటంను కొనసాగిస్తామని అన్నారు.
* నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు మోసం
* నిరుద్యోగ భృతి పెద్ద మోసం
* జాబ్ క్యాలెండర్ పెద్ద జోక్
* ఈ రాష్ట్రంలో 14 లక్షల విద్యార్థులకు 10 వేల కోట్లపైగా బకాయిలు ఉన్నాయి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి.
* ఇచ్చిన హామీలను అమలు పరచని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ప్రభుత్వాన్ని మెడల్ వంచుతామని హెచ్చరిస్తూ డిమాండ్ చేశారు.