పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం

Mar 11, 2026 - 14:40
 0  4
పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం
పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం

జోగులాంబ గద్వాల 11 మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ఇటిక్యాల. ఎర్రవల్లి మండలాలలో  లో పశువులలోలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం తేది 10/3/2026 నుండి 9/4/2026 వరకు నిర్వహించడం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా పశువైద్య సిబ్బంది 2 బృందాలుగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తేది :11/3/2026 బుధ వారం నాడు ఎర్రవల్లి మండలం  పుటాన్ దొడ్డి మరియు ధర్మవరం గ్రామాలలో లో ఉచిత గాలికూంటూ వ్యాధినివారణ టీకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  గాలికుంటూ వ్యాధి వచ్చిన పశువుల నోటిలో,గిట్టల మధ్యలో పుండ్లు కావటం చోంగ కారటం, పశువు మేత తినకపోవటం, జ్వరం ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకిన పశువును మంద నుంచి వేరుచేసి చికిత్స అందంచాలి. మరియు ప్రతి రోజు నోటిని,గిట్టలని పోటాష్యామ్ పర్మాంగానేట్ లోషన్ తో కడగాలి. వ్యాధి సోకిన పశువుకు జొన్న సంకటి, జావా, వంటివి త్రాగిచాలి.పాడి పశువులలో ఈ వ్యాధి వలన పాలు తగ్గిపోవటం, చూడి పశువులు ఈసుకపోవటం, అపుడప్పుడు మరణాలు కూడా సంభవిచటం జరుగుతుంది.కాబట్టి గాలి కుంటూ వ్యాధి రాకుండా ముందుగానే టీకాలు వేయించుకోవాలని రైతులకు వివరించటం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా తెల్లపశువులు 146 మరియు 36 గేదెలకు గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు వేయటం జరిగింది. ఈ కార్యక్రమంలలో ధర్మవరం గ్రామ సర్పంచ్  వెంకటేశ్వరమ్మ  , డాక్టర్ వినయ్ కుమార్ , డాక్టర్ భువనేశ్వరి ,, మాసుమన్న VLO, కార్తీక్ VA,,విజయ భాస్కర్ భారతీశా ,మురళి , గోపాలమిత్ర పశువైద్య సిబ్బంది పాల్గొనడం జరిగినది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333