జడ్.పి.ఎస్. వెంకటాపురం పాఠశాల యందు పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం
*జడ్.పి.ఎస్. వెంకటాపురం పాఠశాల యందు పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం*
తెలంగాణ వార్త వెంకటాపురం : జడ్.పి.ఎస్. వెంకటాపురం పాఠశాల యందు పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయబడినది. ఈ సమావేశానికి ఏఏపిసి చైర్మన్ స్వరూప రాణి మరియు వెంకటాపురం మండల్ గ్రామపంచాయతీ సర్పంచి సరస్వతి ఉప సర్పంచ్ సునీల్ విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో గత సంవత్సరం అత్యధిక మార్కులు సాధించిన గుడిమెట్ల లిఖితకి శ్రీదేవి 5000 రూపాయలు నగదు బహుమతిని వారి తండ్రిగారైన రమేష్ కి అందజేయడం జరిగింది .ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ సంవత్సరం గత సంవత్సరం 10వ తరగతి మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించాలని మీ తల్లిదండ్రులకి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరడం జరిగింది . తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు చక్కటి పాటలకు డాన్సులు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.