పదో తరగతి విద్యార్థుల వీడ్కోల వేడుక
గోదావరిఖని, రామగుండం ప్రతినిధి, మార్చి 11: గోదావరిఖనిలోని కృష్ణవేణి పాఠశాలలు బృందావన్ గార్డెన్ లో బోన్ వెయాజ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మరియు కరస్పాండెంట్ మంజుల శ్రీనివాస్ రెడ్డి ని కృష్ణవేణి విద్యాసంస్థల ప్రధాన ఉపాధ్యాయుల రాజిరెడ్డి (ఎం.కె.టి.ఎస్)
సత్యనారాయణ (అడ్డగుంటపల్లి), సిరాజ్ బేగ్ (ఎన్టి.పి.సి), శైలజ (అయాన్) మరియు అకాడమిక్ ప్రిన్సిపాల్ అయినటువంటి రామకృష్ణ స్వాగతం పలకారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా దీప ప్రార్థనతో ప్రారంభించడం జరిగినది. ఫేర్వెల్ డే ప్రాముఖ్యత గురించి పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పదోతరగతి వీడ్కోలు సమావేశము విద్యార్థులకు ఎంతో ముఖ్యమైనదేని ఈ కార్యక్రమంలో విద్యార్థులు తన చిన్ననాటి స్మృతిలను గుర్తు చేసుకుంటారు అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పదవ తరగతి విద్యార్థులు తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించి దీవెనలు తీసుకోవడం జరిగింది. తదంతరం విద్యార్థులు ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగినది.