పదో తరగతిలో 93.93% ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో గద్వాల జిల్లా 93.93 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 29వ స్థానంలో నిలిచిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 8,037 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, బాలురు 3,548 మంది, బాలికలు 4,001 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాసైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.