తుంగభద్ర నుంచి జిల్లాకు 1.5 టీఎంసీల తాగునీటి విడుదల

Jul 16, 2026 - 20:37
 0  2
తుంగభద్ర నుంచి జిల్లాకు 1.5 టీఎంసీల తాగునీటి విడుదల

జిల్లాలో నెలకొన్న తాగునీటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని జూలై 16 గురువారము ఉదయం 9 గంటలకు తుంగభద్ర డ్యాం నుంచి రోజుకు 900 క్యూసెక్కుల చొప్పున మొత్తం 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి తెలిపారు. ఈ నీరు జిల్లాకు చేరుకోవడానికి సుమారు వారం రోజులు పట్టే అవకాశం ఉందన్నారు.విడుదల చేస్తున్న నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిందిగా కలెక్టర్ స్పష్టం చేశారు. పంటల సాగు లేదా ఇతర అవసరాలకు నీటిని వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నీటి సరఫరా మార్గాల వెంట జలవనరుల, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టి అక్రమ వినియోగాన్ని అరికట్టాలని ఆదేశించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333